- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భూమికి త్వరలో రెండు చందమామలు.. ఈ నెలలోనే ప్రత్యక్షం కాబోతున్న మరో చంద్రుడు..
దిశ, ఫీచర్స్ : భూమి త్వరలో రెండవ చంద్రుడిని పొందబోతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇది కొద్ది వారాల పాటు మాత్రమే. సెప్టెంబరు చివరి నాటికి ఈ దృగ్విషయం జరగబోతుండగా.. ఒక గ్రహశకలం మన గ్రహానికి చందమామగా మారుతుంది. 2024 PT5 అని పేరు పెట్టబడిన చిన్న గ్రహశకలం ఆగస్టు 7న ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) ద్వారా కనుగొనబడింది. ఇది ప్రస్తుతం భూమి గురుత్వాకర్షణ ద్వారా చిక్కుకునే పథంలో ఉందని స్పెయిన్‌లోని యూనివర్సిడాడ్ కాంప్లూటెన్స్ డి మాడ్రిడ్‌లోని పరిశోధకులు కార్లోస్ మరియు రౌల్ డి లా ఫ్యూంటె మార్కోస్ తెలిపారు. రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక పేపర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్రహశకలం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుందని.. దాదాపు ఒక కక్ష్య పూర్తి చేసిన తర్వాత మన నుంచి దూరంగా జూమ్ అవుతుందని చెప్పారు. అయితే భూమికి తాత్కాలికంగా రెండు మూన్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండు సందర్భాల్లో ఇలాగే జరిగింది. మొదటిది జూలై 2006లో ఒక చిన్న చంద్రుడు భూమి చుట్టూ ఒక సంవత్సరం పాటు తిరిగాడని... 2020లోనూ మినీ మూన్ మన దగ్గర దాగి ఉందని చెప్పబడింది. కానీ శాస్త్రవేత్తలు నిశ్చయాత్మక డేటాను కనుగొనడంలో విఫలమయ్యారు.
గ్రహశకలం 2024 PT5 అర్జున గ్రహశకలం బెల్ట్‌లో ఉద్భవించింది. ఇక్కడ భూమికి సమీపంలో ఉన్న వస్తువులు మన గ్రహం కక్ష్యలను పోలి ఉంటాయి. కాగా గ్రహశకలం భూమికి, బయటికి వెళ్లే ఆకర్షణీయమైన అనుకరణను సోషల్ మీడియాలో ఖగోళ శాస్త్రవేత్త టోనీ డన్ షేర్ చేశారు. ఇక గ్రహశకలం జనవరి 9, 2025న తిరిగి వస్తుందని.. దాని తదుపరి విజిట్ 2055 వరకు జరగదని చెప్తున్నారు.
Kelly Kizer Whitt @Astronomommy wrote a nice article about our soon-to-be mini-moon. https://t.co/YaD7SQrGTE https://t.co/C63BXBbZrp
— Tony Dunn (@tony873004) September 12, 2024