వైట్ వాటర్ కిడ్స్.. క్రియేటివిటీకి వైకల్యం అడ్డురాదని నిరూపించారు.!

by Daayi Srishailam |

అదే "వైట్‌వాటర్ కిడ్స్"

వైట్ వాటర్ కిడ్స్.. క్రియేటివిటీకి వైకల్యం అడ్డురాదని నిరూపించారు.!
X

దిశ, ఫీచర్స్: ఇద్దరు వికలాంగ అక్కాచెళ్లెళ్లు శ్వేత, అంకితా ధారివాల్ ఒక అద్భుతమైన బేబీవేర్ బ్రాండ్‌ను రూపొందించారు. అదే "వైట్‌వాటర్ కిడ్స్". సాంప్రదాయ హస్తకళా నైపుణ్యంతో కవితలను ఫాబ్రిక్‌లో అల్లుతారు. ఈ బ్రాండ్ ఫ్యాషన్ ట్రెండ్‌ల కోసం కాదు. పిల్లల చర్మానికి సున్నితమైన దుస్తులను అందివ్వడం కోసం.

తమ పిల్లల కోసం..

2017లో స్థాపించబడిన వైట్‌వాటర్ కిడ్స్ ఆర్గానిక్ కాటన్, మినిమలిస్ట్ డిజైన్, సాంప్రదాయ భారతీయ హస్తకళలను మిళితం చేసి పిల్లల చర్మానికి సరిపడే సున్నితమైన దుస్తులు, బొమ్మలను తయారుచేస్తుంది. వైట్‌వాటర్ కిడ్స్ ఆలోచన అహ్మదాబాద్‌లో మొదలైంది. టెక్స్‌టైల్ డిజైనర్‌గా అనుభవం ఉన్న శ్వేత తన పిల్లలకు శ్వాసకోశ సౌకర్యమైన, సహజమైన, సున్నితమైన దుస్తుల కోసం వెతికే సమయంలో వచ్చిన ఆలోచన ఇది. తమ వికలాంగత్వ అనుభవాలను ఒక నిశ్శబ్ద విప్లవంగా మార్చి శ్వేత, అంకిత సమాజంలో తమకు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని, ఆనందాన్ని సాధించారు.

ఇద్దరూ ఇద్దరే..

ఆర్గానిక్ కాటన్ ద్వారానే పిల్లలకు హెల్దీ డ్రెస్ అందివ్వాలనే ఆలోచనతో మొదలైన వైట్ వాటర్ కిడ్స్ ప్రారంభం నుంచే తన ప్రత్యేకతను చాటుకుంది. పేరు విషయంలోనే దాని స్పెషాలిటీ ఏంటో చూపెట్టుకున్నారు. అందుకే వైట్‌వాటర్ కిడ్స్ వారి విలువలను ప్రతిబింబిస్తుంది. వైట్ అంటే స్వచ్ఛత, వాటర్ అంటే జీవనం, పారదర్శకత, ప్రవాహం. లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి స్టోరీటెల్లింగ్, డిజైన్ నేపథ్యం ఉన్న అంకిత బ్రాండ్‌కు బలమైన డిజిటల్ ఉనికిని నిర్మించింది. శ్వేత ఒక ఉద్వేగభరిత రచయిత్రిగా, తన కవితలను దుస్తుల ఫాబ్రిక్‌లో అల్లడం ప్రారంభించింది.

సహజ రంగులతో..

బెంగాల్‌లోని కంథా కళాకారులు, కచ్‌లోని అజ్రఖ్ నిపుణులు, దక్షిణ భారతంలోని నేతకారులతో కలిసి వైట్‌వాటర్ కిడ్స్ పనిచేస్తుంది. పిల్లలకు సున్నితమైన ఫాబ్రిక్‌లను సృష్టిస్తూ, సాంప్రదాయ హస్తకళలను కాపాడుతూ కళాకారులకు జీవనోపాధిని అందిస్తుంది. సాంప్రదాయ బ్లాక్ ప్రింట్స్, ఇండిగో వంటి సహజ రంగులతో వారి ఉత్పత్తులు వైవిధ్యాన్ని స్వీకరిస్తాయి. ప్రతి ఉత్పత్తి సహజ ఫైబర్స్, హెర్బల్ డైస్, జీరో-ప్లాస్టిక్ విధానంతో తయారవుతుంది. ఇవి భారతీయ వాతావరణానికి పిల్లల సున్నితమైన చర్మానికి అనువైనవి.

వైకల్యాన్ని అధిగమించి

శ్వేతకు విటిలిగో, అంకితకు నడక వికలాంగత్వం ఉన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి వాళ్లెప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండాలనుకోలేదు. నాయకత్వ లక్షణాలు ఇద్దరిలోనూ మెండుగా ఉన్నాయి. వైట్‌వాటర్ కిడ్స్ కస్టమర్లు భారత్, మధ్యప్రాచ్యం, సింగపూర్, కాలిఫోర్నియా, ఇటలీలో ఉన్నారు. జబ్లాస్, కుర్తా సెట్స్, దిండ్లు, టవల్స్ వంటి ఉత్పత్తుల ధరలు ₹1,800 నుంచి ₹2,300 మధ్య ఉంటాయి. వాటిపై డిజైన్ గౌరవంతో, కవిత్వం ఉద్దేశంతో కలుస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశమున్నా పిల్లలు, కళాకారులకు దీన్నొక సంరక్షణ వ్యవస్థగా నిర్మించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు.

Next Story