ఎలాంటి కెమికల్స్ లేకుండా.. ఫేషియల్ హెయిర్‌ను నేచురల్‌గా తొలగించే స్టోన్.. ఎలా వాడాలంటే..

by Naga Rani Yarlagadda |

అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్. ఈ ప్రాబ్లమ్ తో ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. ముఖభాగంలో పెదాలపైన, చెంపలపై, గడ్డం వద్ద అన్ వాంటెడ్ హెయిర్ పెరిగి..

ఎలాంటి కెమికల్స్ లేకుండా.. ఫేషియల్ హెయిర్‌ను నేచురల్‌గా తొలగించే స్టోన్.. ఎలా వాడాలంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్. ఈ ప్రాబ్లమ్ తో ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. ముఖభాగంపై పెదాలపైన, చెంపలపై, గడ్డం వద్ద అన్ వాంటెడ్ హెయిర్ పెరిగి.. బయటికి వెళ్తే అందరూ అదోలా చూస్తారని ఇళ్లలోనే ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. ఇక కొందరైతే వాక్సింగ్ చేయించుకుంటారు. అది చాలా పెయిన్ తో కూడిన వ్యవహారం. ఇంకొందరు వేలు, లక్షల రూపాయలు వెచ్చించి మరీ లేజర్ ట్రీట్మెంట్, పర్మినెంట్ అన్ వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఎలాంటి పెయిన్ లేకుండా నేచురల్ అన్ వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేసుకునే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

కానీ.. ఈ ఒక్కరాయితో అన్ వాంటెడ్ హెయిర్ ను ఈజీగా పోగొట్టుకోవచ్చు. పొన్నతారం (Ponnatharam) అనే రాయి ఆయుర్వేదిక్ స్టోర్లలో దొరుకుతుంది. చూడటానికి చిన్న చిన్న ముక్కలుగా పసుపు రంగులో ఉంటుంది. దీనిని తెచ్చుకుని.. దంచి పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా పాలను కలిపి.. ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఉన్న ప్లేసులో రాసుకోవాలి. అది డ్రై అయ్యాక.. వెట్ క్లాత్ తీసుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో రుద్దాలి. ఒక్క ప్రయత్నంలోనే హెయిరంతా పోదు కానీ.. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటా.. అన్ వాంటెడ్ హెయిర్ పోయి.. మీ ముఖం క్లీన్‌గా కనిపిస్తుంది. ఆయుర్వేదిక్ స్టోర్లలో పొన్నతారం పొడి కూడా దొరుకుతుంది. మీ దగ్గర్లో ఉన్న స్టోర్లో దొరికితే ట్రై చేసి చూడండి.

Next Story