- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026:సంక్రాంతి స్పెషల్ ముగ్గులు.. సులభంగా వేయగలిగే అందమైన రంగోలి డిజైన్స్ ఇవే!
సంక్రాంతికి వంటలే కాదు. ముగ్గులు కూడా బాగా ఫేమస్

దిశ,వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక, కొత్త సంవత్సరం మొదలు కాగానే మొదట గుర్తొచ్చే పండుగ సంక్రాంతి. జనవరి 1వ తేదీ రాగానే సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని చిన్న పెద్ద అందరూ ఎదురు చూస్తారు. ఈ క్రమంలో మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుగ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. పట్టణం నుంచి సొంత ఊర్లకు వెళ్లడానికి నగరంలోని ఉద్యోగస్తులు ప్లానింగ్ వేసుకుంటున్నారు. ఇక. విద్యార్థులు సైతం పండుగ సెలవులు ఇవ్వడంతోనే ఇళ్లకు పయనమవుతారు.
ఇక, పల్లెల్లో పండుగ వేడుకలు ఎలా జరుపుకోవాలో అనే ముందస్తు ప్రణాళిక గా అక్కాచెళ్లెళ్లు ఒక దగ్గర గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేస్తారనే సంగతి తెలిసిందే. సంక్రాంతి ముందు రోజు భోగికి ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టడం, రేగుపండ్లు, పూలతో అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే.. సంక్రాంతికి వంటలే కాదు. ముగ్గులు కూడా బాగా ఫేమస్. అందుకే.. పండుగ వారం రోజులు ఉండగానే స్కూళ్లు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు పెడతారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు.
ఈ రంగోలి పోటీల్లో చాలా మంది మహిళలు పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ పోటీలే కాదు.. పండుగ సమయంలో ఇంటి ముందు వేసిన ముగ్గులకు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎలాగంటే.. పక్కింటి వారి ముగ్గు కంటే తామే అందంగా వేయాలని అనుకుంటారు. అయితే.. ఈ సంక్రాంతి 2026కి మీరు కూడా మీ ఇంటి ముందు అందరినీ ఆకర్షించే అందమైన ముగ్గు వేయాలనుకుంటున్నారా.. ఐతే వెంటనే ఈ క్రింది ముగ్గులు ట్రై చేయండి.






