ప్రయాణం.. ప్రకృతి ఆస్వాదన కూడా ట్రీట్మెంటే..! ఆ దేశంలో నయా ట్రెండ్

by Javid Pasha |   (  Updated:2025-10-15 16:41:02  IST  )

రోగులకు మామూలు ట్యాబ్లెట్స్ లేదా థెరపీ సెషన్లకు బదులు, ప్రకృతి అందాలను చూడాలని, పీస్‌ఫుల్ ప్రదేశాలకు ట్రావెల్ చేయాలని అక్కడి డాక్టర్లు సూచిస్తుంటారు.

ప్రయాణం.. ప్రకృతి ఆస్వాదన కూడా ట్రీట్మెంటే..! ఆ దేశంలో నయా ట్రెండ్
X

దిశ, ఫీచర్స్ : అనారోగ్యంతో బాధపడుతున్నారా? మానసిక వేదనతో కృంగిపోతున్నారా? అయితే మీరు ఫలానా ప్రాంతాలకు ట్రావెల్ ట్రావెల్ చేయండి. అక్కడి అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదించండి. వన్‌వీక్‌లో ప్రాబ్లం సాల్వ్ అయినట్టే..! అంటారు అక్కడి డాక్టర్లు. అనడమే కాదు తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు అవసరాన్ని బట్టి ప్రిస్ర్కిప్షన్‌లోనూ సూచిస్తారు. ఎందుకంటే ఇలా సూచించడం అక్కడి ఆరోగ్య విధానంలో భాగం కాగా, ప్రపంచంలోనే ఈ నయాట్రెండ్‌ను క్రియేట్ చేసిన దేశశంగా స్వీడన్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రకృతిలో హీలింగ్ పవర్

నేచర్‌కు గొప్ప హీలింగ్ పవర్ ఉందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. అయితే స్వీడన్ దేశంలోని ఆరోగ్యశాఖ సైతం అది నిజమేనని నమ్ముతోంది. అక్కడి వైద్యులు తమవద్దకు వచ్చిన రోగులకు మామూలు ట్యాబ్లెట్స్ లేదా థెరపీ సెషన్లకు బదులు, ప్రకృతి అందాలను చూడాలని, పీస్‌ఫుల్ ప్రదేశాలకు ట్రావెల్ చేయాలని లేదా రోజువారీ ఒత్తిడి నుంచి విరామం తీసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇది అధికారికంగా ప్రిస్క్రిప్షన్‌లో సూచించవచ్చు కూడా. ఈ కొత్త విధానం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీ రోల్ పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

స్ట్రెస్, బర్న్ అవుట్ దూరం

మెరుగైన ఆరోగ్యం కోసం ట్రావెల్ చేయాలనేది ఏదో కొందరు చెబుతున్న విషయమే కాదు, స్వీడన్‌లోని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో భాగంగా ఇది అమలవుతోంది. ముఖ్యంగా స్ట్రెస్, డిప్రెషన్, బర్నౌట్ వంటి సమస్యలకు అక్కడి డాక్టర్లు దీనిని ఎఫెక్టివ్ ట్రీట్‌మెంట్‌గా చూస్తున్నారు. అంతేకాదు రోగి పరిస్థితిని బట్టి ట్రావెల్ చేయాల్సిన నిర్దిష్ట ప్రదేశాలు కూడా ఇక్కడ వైద్యులు సూచిస్తారు. ఉదాహరణకు ఒంటరి నడకలు (Walks alone), లేదా గ్రూప్ టూర్లు వంటివి ఇందులో భాగం. పైగా స్వీడన్‌లోని ప్రశాంత వాతావరణం కలిగిన అందమైన సరస్సులు, అడవులు, మంచు కొండలు, కాజీ మౌంటైన్ క్యాబిన్లు వంటి ప్రదేశాలు సహజంగానే రిలాక్సేషన్ ఇచ్చేంత అద్భుతంగా ఉంటాయి. వాటిని ఆస్వాదించడంవల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్స్) విడుదలవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. శారీరక అనారోగ్యాలను దూరం చేస్తాయి.

వ్యాధులు కంట్రోల్

స్వీడన్ ఆరోగ్య నిపుణులు, పరిశోధకుల ప్రకారం కూడా ప్రకృతితో సంబంధం పెంచుకోవడం హార్ట్ డిసీజెస్, డయాబెటిస్ వంటి వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ దేశం ఈ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తోందని కూడా పలువురు పేర్కొంటున్నారు. ట్రావెలింగ్ ద్వారా జీవితాన్ని మార్చుకోవడం సాధ్యమని నిరూపిస్తూ స్వీడన్ ‘చేంజ్ ఆఫ్ సీనరీ’ బెస్ట్ క్యూర్ అని చాటుతోంది. ఇది పర్యావరణం, మానసిక ఆరోగ్యం మధ్య గల సంబంధాన్ని బలపరుస్తున్నది. లింక్

Read More..

రోజుకు 3 వాల్‌నట్స్‌‌తో మెదడుకు మేలు.. గుండె జబ్బులకు చెక్!

Next Story