- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Spam messages : మీకూ ఆ టైప్ ఆఫ్ మెసేజ్‌లు వస్తున్నాయా? అసలు విషయం ఇదేనట!
Spam messages : మీకూ ఆ టైప్ ఆఫ్ మెసేజ్‌లు వస్తున్నాయా? అసలు విషయం ఇదేనట!

దిశ, ఫీచర్స్ : మీకూ ఆ టైప్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయా? ఎన్నడూ లేనిది ఇలా ఎందుకు వస్తున్నాయనే అనుమానం వెంటాడుతోందా? డోంట్ వర్రీ..! మీకే కాదు, మే 14 నుంచి అందరికీ అట్లనే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చిస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అసలు విషయమేంటో తేల్చి చెప్పింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI). ఆ తరహా మెసేజ్‌లు మీ మంచికోసమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఇంతకీ అవేం మెసేజ్‌లు, ఎందుకు వస్తు్న్నాయనే కదా మీ డౌట్? తెలుసుకుందాం పదండి.
ఫోన్లు వాడుతున్న ప్రతీ ఒక్కరికీ టెక్ట్స్ మెసేజ్‌లు రావడం సహజమే. తరచూ ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. అందులో తెలిసిన వ్యక్తులు పంపినవి కొన్నైతే, స్పామ్ మెసేజ్‌లు, బయటి నుంచి వచ్చే వాణిజ్య సందేశాలు కూడా చాలానే ఉంటాయి. అయితే ఇన్నిరోజులుగా వచ్చే మెసేజ్‌లకు, మే 14 నుంచి వచ్చే మెసేజ్‌లకు వాటి టెక్ట్స్ విషయంలో స్పష్టమైన తేడా కనిపించడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చిన ప్రతీ మెసేజ్ చివరలో P, T, S, G వంటి సఫిక్స్ లెటర్స్(Suffix letters) వస్తుండటంతో తమ ఫోన్లు హ్యాక్ ఏమైనా అయ్యాయా? సైబర్ నేరగాళ్లు ఏదైనా చేస్తున్నారా? అవి స్పామ్ మెసేజ్‌లా? మెసేజ్ చివరలో క్యాపిటల్ లెటర్ ఎందుకు కనిపిస్తోంది? ఓపెన్ చేయొచ్చా లేదా? అనే సందేహాలు పలువురిని వెంటాడాయి. దీంతో అనేకమంది సోషల్ మీడియాలో చర్చిస్తుండగా.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అసలు విషయాన్ని వెల్లడించి, అనుమానాలను క్లియర్ చేసింది.
ఇండియాలో స్పామ్ మెసేజ్‌లు, అయాచత వాణిజ్య సందేశాల (UCC) సమస్యను అరికట్టడానికి ట్రాయ్ (TRAI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలో భాగమే సదరు మెసేజ్‌లు అని ఆ సంస్థ పేర్కొన్నది. కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) 2025 సవరణలో భాగంగా, మే 6, 2025 నుంచే ఈ విధమైన రూల్స్ ప్రవేశపెట్టినట్లు ట్రాయ్ పేర్కొంది. ఇందులో భాగంగా మే 14, 2025 నుంచి వినియోగదారులకు వచ్చే బల్క్ SMS సందేశాల చివరలో P, T, S, G వంటి సఫిక్స్ లెటర్స్ జోడించి ఉంటున్నాయి.
ట్రాయ్ ప్రకారం.. మెసేజ్‌ల చివరలో వచ్చే లెటర్స్‌కు ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. దాని ప్రకారం "-P" అంటే ప్రమోషనల్ సందేశాలు అని అర్థం. అంటే ప్రొడక్ట్స్ లేదా వివిధ సేవలను ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన మెసేజ్ చివర ఈ అక్షరాన్ని వాడాలి. ఇక "-T" అంటే ట్రాన్సాక్షనల్ అని అర్థం. OTPలు, ఆర్డర్ అప్‌డేట్‌లు, బ్యాంక్ లావాదేవీల వివరాలకు సంబంధించిన మెసేజ్‌లకు చివరలో ఇది ఉంటుంది. అలాగే "-S" అంటే సర్వీస్ సందేశాలు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇది ప్రమోషనల్ గానీ, కస్టమర్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని గానీ అందిస్తాయి. ఇక మెసేజ్ చివరన "-G" అని ఉంటే గనుక అది గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చిన మెసేజ్‌గా అర్థం చేసుకోవాలి. ప్రజా సేవలు లేదా అత్యవసర నోటిఫికేషన్‌లకు సంబంధించిన సందేశాలకు దీనిని జోడిస్తారు. ప్రజలు, వినియోగదారులను మోసపూరిత లేదా అనవసర సందేశాల నుంచి రక్షించడానికి ఈ నిబంధనలు తెచ్చినట్లు ట్రాయ్ పేర్కొన్నది.






