మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులే క్యాన్సర్‌ మోసుకొస్తున్నాయి.. జర జాగ్రత్త..

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-05 16:25:49  IST  )

ఇంటిని శుభ్రంగా, సిస్టమాటిక్‌గా, కంఫర్టబుల్‌గా, మోడ్రన్‌గా ఉంచే ప్రయత్నంలో కొన్ని తప్పులు చేస్తూ రిస్క్‌లో పడిపోతున్నాం. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటివి కొని తెచ్చుకుంటున్నాం. అవును..

మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులే క్యాన్సర్‌ మోసుకొస్తున్నాయి.. జర జాగ్రత్త..
X

దిశ, ఫీచర్స్ : ఇంటిని శుభ్రంగా, సిస్టమాటిక్‌గా, కంఫర్టబుల్‌గా, మోడ్రన్‌గా ఉంచే ప్రయత్నంలో కొన్ని తప్పులు చేస్తూ రిస్క్‌లో పడిపోతున్నాం. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటివి కొని తెచ్చుకుంటున్నాం. అవును.. ఇంట్లో ఉపయోగించే వస్తువులు ఇలాంటి రోగాలను మోసుకొస్తున్నాయి. ఇంతకీ అవేంటి? ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పర్యావరణానికి అనుకూలంగా సురక్షితంగా ఎలా ఉండాలి?

ఎయిర్ ఫ్రెషనర్లు

ఇవి శ్వాసకోశ వ్యవస్థను చికాకు పెట్టే, ఆస్తమాను తీవ్రతరం చేసే అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను (VOC- వోలటైల్ ఆర్గానికి కాంపౌండ్స్) రిలీజ్ చేస్తాయి. వీటికి బదులుగా ఇంట్లో సువాసనలు వెదజల్లేందుకు ఎస్సెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే.. ఇంటిని వెంటిలేట్ చేయడం వంటివి సహజ ప్రత్యామ్నాయ మార్గాలు.

నాన్-స్టిక్ వంటసామాను

నాన్ స్టిక్ వంటసామాను వేడెక్కినప్పుడు..ఇందులోని కోటింగ్ పెర్ఫ్లోరినేటెడ్ సమ్మేళనాలు (PFC) కలిగిన విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఇవి క్యాన్సర్, అవయవ నష్టం(ఆర్గాన్ డ్యామేజ్) వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. సిరామిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ వంటసామాను సురక్షితమైన ప్రత్యామ్నాయాలు.

క్లీనింగ్ ప్రొడక్ట్స్

క్లీనింగ్ ఉత్పత్తుల్లో చాలా వరకు అమ్మోనియా, బ్లీచ్ వంటి హార్ష్ కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మం, కళ్ళు, శ్వాసకోశాన్ని చికాకుపెడతాయి. ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించి క్లీనింగ్ చేయడం మంచిది. పర్యావరణ అనుకూలంగా ఉత్పత్తులను ఎంచుకోవడం బెటర్.

పురుగుమందులు

ఇవి హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. తలనొప్పి, తల తిరగడం, నాడీ సంబంధిత నష్టానికి కూడా దారితీస్తాయి. రంధ్రాలు, పగుళ్లను మూసివేయడం, ఆహార వనరులను శుభ్రం చేయడం వంటి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులను పాటించాలి. లేదా డయాటోమాసియస్ ఎర్త్ వంటి నేచురల్ పెస్ట్ కంట్రోల్ పద్ధతులను ఎంచుకోండి.

ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లు

కొన్ని ప్లాస్టిక్‌లలో బిస్ఫినాల్-ఎ (BPA), థాలేట్‌లు ఉంటాయి. ఇవి ఆహారంలోకి లీక్ అవుతాయి. హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. డెవలప్మెంట్ సమస్యలను కలిగిస్తాయి. హానికరమైన రసాయనాలు లీక్ కాకుండా ఉండటానికి ఫుడ్ స్టోరేజ్ కోసం గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించండి.

టాక్సిక్ ప్రొడక్ట్స్ వల్ల కలిగే సమస్యలు :

  • శ్వాసకోశ సమస్యలు: గురక, దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు లేదా నాసికా భాగాల చికాకు.
  • స్కిన్ ఇరిటేషన్: చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఎరుపు ఎక్కడం.
  • కంటి చికాకు: కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం, మండుతున్న అనుభూతి.
  • తలనొప్పి లేదా తలతిరగడం.
  • వికారం, వాంతులు
  • అలసట లేదా బలహీనత.
  • మానసిక స్థితిలో మార్పులు.
Next Story