International Mother Language Day : మాతృభాషలో మాట్లాడుదాం రండి.. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

by Muthe.Rajitha |

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day).

International Mother Language Day : మాతృభాషలో మాట్లాడుదాం రండి.. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day). ప్రజలు నేడు ఒక్కరోజైనా తమ మాతృభాషలో మాట్లాడుకోవాలని భాషా నిపుణులు సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ వేత్తలు, మేధావులు, భాషా నిపుణులు.. మాతృభాష అమ్మ వంటిది అని, మనం ఎక్కడికి వెళ్ళినా తల్లిని గుర్తు పెట్టుకున్నట్టు మాతృభాష మీద కూడా మామకారాన్ని మరవకూడదని తెలియజేస్తునారు. భవిష్యత్ తరాలకు తెలుగు అందించి మాతృభాషను కాపాడుకుంటూనే.. ఆంగ్ల విద్యను నేర్పించాలని సూచిస్తున్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు తెలుగు మాట్లాడటం, పుస్తకాలు చదివేలా చేయడం తల్లిదండ్రులే నేర్పించాలని చెబుతున్నారు. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం నిర్వహించుకోవాలని 1999 ఫిబ్రవరి 21న యునెస్కో(UNESCO) ప్రకటించింది. ప్రపంచంలోని చిన్నా, పెద్దా భాషాలన్నిటినీ రక్షించుకోవాలని పిలుపునిచ్చింది. భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే ప్రజల జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని పేర్కొంది. మనదేశంలో భారత్-పాక్ విభజన, పాక్-బంగ్లాదేశ్ విభజన సమయంలో ఏర్పడిన భాషా ఉద్యమాలు.. మానవ సాంస్కృతిక హక్కులను పురస్కరించుకొని ప్రపంచ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకుంది యునెస్కో.

Next Story