- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Happy wifes day: భర్తలకు అలర్ట్.. ఈరోజే హ్యాపీ వైఫ్ డే.. ఎలాంటి గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేస్తారో సిద్ధంగా ఉండండి
Happy wifes day: సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక డే అనేది ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : Happy wifes day: సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక డే అనేది ఉంటుంది. ఓ రోజు లవర్స్ డే, మరో రోజు ఫ్రెండ్షిప్ డే, ఒకరోజు పేరెంట్స్ డే… ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక రోజు ఏదో ఒక డే జరుపుకోవడం అనేది చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ఏప్రిల్ 30వ తేదీ హ్యాపీ వైఫ్ డే అని జరుపుకుంటున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక డే అనేది లభించింది. మీ శ్రీమతికి బహుమతి ఇచ్చేందుకు ఇదే మంచి సమయం హ్యాపీ వైఫ్ డే చెప్పి ఎంచక్కా వారిని సర్ప్రైజ్ చేసేందుకు ఈరోజు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే దంపతులు కాస్త ఎడమొహం పెడమొహంగా ఉన్నారో అలాంటివారు ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చు.
నిజానికి ఈ డేలు అనేవి మన బాధ్యతలను గుర్తు చేసేందుకు ఉద్దేశించినవని పెద్దలు చెబుతుంటారు. కానీ పాశ్చాత్య సంస్కృతిలో ఈ డైలాగు ప్రాధాన్యత ఉన్నప్పటికీ మన భారతీయ సంస్కృతిలో మాత్రం అంతగా ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ విలువలు బంధాలు చాలా బలమైనవి. అందుకే వీటి కోసం ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకొని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు అని పెద్దలు చెబుతుంటారు.
అయితే మార్కెట్ కి మాత్రం ఇలాంటి రోజులు ఎన్ని వస్తే అంత వారికి లాభం అని చెప్పవచ్చు. ఫలానా డే రోజు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండ్ అయిందంటే చాలు ఆ వస్తువులన్నీ షాపుల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. మరి ఈరోజు వైఫ్ డే మరి మీ శ్రీమతికి ఎలాంటి బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారో చూద్దాం.






