అనుకున్నది సాధించాలంటే ఫేక్ స్మైల్ ఉండాల్సిందే

by Malleboina Mahesh |   (  Updated:2025-03-27 06:41:07  IST  )

‘మీరు అనుకున్నది సాధించే వరకు ఫేక్‌గా ఉండండి’.. ఇది సలహా మాత్రమే కాదు మనుగడ వ్యూహం. ఎంత ఒత్తిడి, ఆందోళనలు ఉన్నా ఆత్మవిశ్వాసం తో కూడిన చిరునవ్వులు..

అనుకున్నది సాధించాలంటే ఫేక్ స్మైల్ ఉండాల్సిందే
X

‘మీరు అనుకున్నది సాధించే వరకు ఫేక్‌గా ఉండండి’.. ఇది సలహా మాత్రమే కాదు మనుగడ వ్యూహం. ఎంత ఒత్తిడి, ఆందోళనలు ఉన్నా ఆత్మవిశ్వాసం తో కూడిన చిరునవ్వులు.. వ్యక్తిగత పరిస్థితులతో కోపంగా ఉన్నా కస్టమర్‌తో వినయంగా నడుచుకోవడం.. సేల్స్ ఎక్స్‌పర్ట్స్ ఎమోషనల్ లేబర్ కిందకే వస్తుంది. అయితే ఈ ఫేక్ స్మైల్ వారి మెంటల్ హెల్త్, జాబ్ శాటిస్‌ఫాక్షన్‌పై ప్రభావం చూపుతుంది.

దిశ, ఫీచర్స్: ఇండస్ట్రియల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం.. అమ్మకందారుల నైతిక స్వభావం వారు పనిలో భావోద్వేగాలను ఎలా మేనేజ్ చేస్తారు? ఇది చివరికి వారి శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను వివరించింది. డెడ్ లైన్స్, కస్టమర్స్ తిరస్కరణ కారణంగా దాదాపు 63 శాతం మంది అమ్మకందారులు మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని, కస్టమర్ అంచనాలు మారుతున్న కొద్దీ వారి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని నివేదించింది.

భావోద్వేగ శ్రమ..

వృత్తిపరమైన అంచనాలను అందుకోవడానికి ఎమోషన్స్‌ను మేనేజ్ చేయడానికి అవసరమైన ప్రయత్నం భావోద్వేగ శ్రమ. ఇది రెండు మార్గాల్లో వ్యక్తమవుతుంది. ఒకటి ఉపరితల నటన.. అంటే మీరు నిజంగా అనుభూతి చెందని చిరునవ్వు లేదా ఉత్సాహాన్ని బలవంతం చేయడం. ఇంకోటి డీప్ యాక్టింగ్.. ప్రామాణికంగా కనిపించడానికి అవసరమైన భావోద్వేగాలను ఉత్పత్తి చేయడం. అంటే అమ్మకందారులు డీప్ యాక్టింగ్‌ చేస్తారు. వారి భావోద్వేగాలను అమ్మకాల విధానానికి అనుగుణంగా మలుచుకుంటారు. ఇతరులకు మంచిగా కనిపించడంపై ఎక్కువగా దృష్టి సారించిన వారు.. అవసరమైనప్పుడు మారిపోతారు.

ఫేక్‌తో ఎదురుదెబ్బ

సేలింగ్ పర్సన్స్ అందరూ ఒకేలా ఉండరని, ఒక్కోసారి రియాక్షన్స్ కఠినంగా ఉంటాయని కస్టమర్స్ గ్రహించగలరు. అలాంటప్పుడు ప్రతికూల కస్టమర్ ప్రతిస్పందనలు (తిరస్కరణ, అనుమానం, వాదన) అమ్మకందారుల ఒత్తిడి, అసంతృప్తిని తీవ్రతరం చేస్తాయి. ఇది హార్మ్ ఫుల్ సైకిల్‌ను క్రియేట్ చేస్తుంది. ఉద్యోగ సంతృప్తిని మరింత తగ్గిస్తుంది. ఎంప్లాయీస్ బర్నౌట్ నేరుగా ఆదాయంపై ప్రభావం చూపిస్తాయని.. వారు అవకాశాన్ని కోల్పోతే, మనీ, వినియోగదారుడి నమ్మకం సహా వారు కంపెనీకి తీసుకువచ్చే ప్రతిదీ కూడా చేజారిపోతుందని అర్థం.

హెల్తీ వర్క్ లైఫ్

కంపెనీలు ఈ ప్రమాదాలను ఎలా తగ్గించగలవు? ఉద్యోగి వ్యక్తిగత విలువకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భావోద్వేగ శ్రమను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కస్టమర్‌తో మాట్లాడేటప్పుడు తాము నటించడం లేదని, నిజాయితీగా ఉంటున్నామనే భరోసానిచ్చే ప్రయత్నం చేయాలి. సపోర్టింగ్ సిస్టమ్స్ వారి భావోద్వేగ శ్రమను మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయడంలో సహాయపడవచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్ కీలకం.. యజమాని, పై స్థాయి ఉద్యోగులతో ఓపెన్‌గా మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల ఒత్తిడిని నివారించవచ్చు.


Read More..

Inspirational story: ఇల్లు లేదు.. బిల్లు లేదు.. సముద్రంలో తేలియాడడం కోసం ఆస్తులు అమ్మేసిన కుటుంబ కథ ఇది!

Next Story