శరీరం అలసిపోతోందా? సమస్య మనసులో ఉండొచ్చు!

by Javid Pasha |   (  Updated:2026-03-27 12:04:51  IST  )

మనసు- శరీరం మధ్య బలమైన సంబంధం ఉంటుంది. కాబట్టి భావోద్వేగాల అణచివేత శారీరక సమస్యలకు దారితీస్తుంది!

శరీరం అలసిపోతోందా? సమస్య మనసులో ఉండొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : అలసిపోవడం లేదా డిసిప్లిన్‌తో పనులు చేయలేకపోవడం వల్ల మీరు బలహీనులో, సోమరులో అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది మానసిక అలసట వల్ల (Mental exhaustion) కూడా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. మీరున్న పరిస్థితుల్లో, వృత్తుల్లో నిరంతరం ఆలోచించడం, ప్రతీ విషయాన్ని ఓవర్ అనాలిసిస్ (Overanalysis) చేయడం, స్వయం నింద, భావాలను అణచివేయడం, ఇతరుల మెప్పుకోసం బలంగా కనిపించే ప్రయత్నం చేయడం వంటివి మనసును అధిక ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు. అంటే ఇక్కడ మనసుకు విశ్రాంతిలేకపోతే కూడా శరీరం ఆ భారాన్ని మోస్తుంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే శరీరంలో వివిధ సమస్యలు తలెత్తుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దామా!

స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ఓవర్‌లోడ్ వల్ల ప్రధానంగా కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరంలో 1. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ (కార్టిసాల్ స్థాయులు పెరగడం), 2. ప్రేగుల్లో సమస్యలు, 3. నిరంతర అలసట, 4. ఆందోళన, 5. బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు సాధారణంగానే తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలా జరిగినంత మాత్రానా మీ శరీరం ‘విఫలం’ అవుతోందని కాదు. కాకపోతే శరీరం మీకు అలర్ట్‌నెస్ సంకేతాలు ఇస్తున్నట్టు. ఎందుకిలా జరుగుతుందంటే మనసు- శరీరం మధ్య బలమైన సంబంధం (gut-brain connection) ఉంటుంది. కాబట్టి భావోద్వేగాలు అణచివేస్తే జీర్ణ సమస్యలు, హార్మోన్ మార్పుల త్వరగా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఇది అత్యంత సాధారణమైన సమస్య కూడా. అయితే చాలామంది లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ దీనికి ప్రధానకారణమైన ఎమోషనల్ ఓవర్‌లోడ్‌ను గుర్తించి నివారించే ప్రయత్నం చేయరు. ఇదే మానసిక ఒత్తిడికి, లోన్లీనెస్‌కు, డిప్రెషన్‌కు, పలు శారీరక అనారోగ్యాలకు దారితీసే చాన్స్ ఉంటుంది. కాబట్టి భావోద్వేగ అలసటను ముందుగా దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

Next Story