ప్రేమ పేరుతో మీతో టైమ్ పాస్ చేస్తున్నారేమో.. ఇలా గుర్తించండి..

by Sujitha Rachapalli |

మీరు ప్రేమలో ఉన్నారా? కానీ నిజంగా మీ భాగస్వామి లవ్‌లో ఉన్నారా లేదా అనే సందేహం కలుగుతుందా? మీతో సమయం గడపడాన్ని ఆనందిస్తున్నారు కానీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు లేవా?

ప్రేమ పేరుతో మీతో టైమ్ పాస్ చేస్తున్నారేమో.. ఇలా గుర్తించండి..
X

దిశ, ఫీచర్స్ : మీరు ప్రేమలో ఉన్నారా? కానీ నిజంగా మీ భాగస్వామి లవ్‌లో ఉన్నారా లేదా అనే సందేహం కలుగుతుందా? మీతో సమయం గడపడాన్ని ఆనందిస్తున్నారు కానీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు లేవా? అయితే కన్ఫర్మ్‌గా మీరు మీ పార్ట్‌నర్‌కు ‘‘టైమ్ పాస్’’ అని గుర్తుంచుకోండి. వారి జీవితంలో మీ ఉనికి కొద్ది రోజులే అయితే.. అవతలి వ్యక్తికి అనుకూలమైన సంబంధంలో ఉన్నారని అనుకుంటే.. మీ విలువని గుర్తించట్లేదని అనిపిస్తే.. ఆ బంధం నుంచి బయటపడటమే బెటర్. ఇంతకీ ఈ టైమ్ పాస్ రిలేషన్‌ను ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం.

* టైమ్ పాస్ సంబంధంలో ఉండటం ఎమోషనల్‌గా అలసిపోయేలా చేస్తుంది. ఫలితంగా హృదయ విదారకం, సమయం కోల్పోవడం జరుగుతుంది. వారు తీవ్రమైన సంభాషణలకు దూరంగా ఉంటారు. భవిష్యత్తు గురించి ఏవైనా చర్చలకు దూరంగా ఉంటూ.. నిబద్ధత గురించి చర్చించినప్పుడు అసౌకర్యంగా కనిపిస్తారు. టాపిక్ చాలా డీప్‌గా, పర్సనల్‌గా మారినప్పుడు చేంజ్ చేస్తారు.

* బంధాన్ని నిలుపుకునేందుకు మీరు మాత్రమే ప్రయత్నం చేస్తారు. మీ పార్ట్‌నర్ నుంచి ఎలాంటి సంకేతాలు ఉండవు. చాట్స్, కాల్స్ ఎప్పుడూ మీరే చేస్తారు.. మీటింగ్స్ కూడా మీరే ప్లాన్ చేస్తారు. అయినా వారు మిమ్మల్ని గౌరవించరు. గుర్తించరు. సహకారం అందించమని అడిగినప్పుడు.. సాకులు చెప్తారు.

* మీ బంధాన్ని రహస్యంగా ఉంచుతారు. దాచడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని స్నేహితులు, బంధువులకు పరిచయం చేయరు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయరు. ఇతరులు ఉన్నప్పుడు మీకు దూరంగా, మీరు అసలు తెలియనట్లుగా ప్రవర్తించవచ్చు.

* మీ భాగస్వామికి ఏదైనా సహాయం కావాలనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని సంప్రదిస్తారు. లేదంటే రోజుల తరబడి అద‌ృశ్యమైపోతారు. జీవితంలో ఇతర విషయాలతో విసుగు చెందినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు.. రిలాక్స్ కావాలని అనుకున్నప్పుడు మీకు మెసేజ్ చేస్తారు. మీ నుంచి ఏదైనా అవసరం కావాలని అనుకున్నప్పుడు మాత్రమే కాల్ చేస్తారు.

* మీ ఎదుగుదల, విజయాలపై ఆసక్తి చూపరు. మీ లక్ష్యాలు, ఆశయాలు, ఫాంటసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీ సక్సెస్‌ గురించి ప్రశంసలు కురిపించరు. మీ ఇబ్బందులు, అడ్డంకుల గురించి మాట్లాడితే లైట్ తీసుకుంటారు.

Next Story