పర్యాటకులను ఆకర్షించే ఆ మూడు ప్రదేశాలు !

by Disha Web Desk 10 |
పర్యాటకులను ఆకర్షించే ఆ మూడు ప్రదేశాలు !
X

దిశ, ఫీచర్స్ : చలికాలం కారణంగా విహార యాత్రలకు వెళ్లలేని వారు ఫిబ్రవరిలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటివారికి అనువైన పర్యాటక ప్రదేశాలు మనదేశంలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో కుటుంబంతో సహా వెళ్లి చూడదగిన వాటిలో షిల్లాంగ్, కసౌలీ, ఉదయ్ పూర్ కూడా ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షిల్లాంగ్, మేఘాలయ

షిల్లాంగ్ మేఘాలయలోని అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి జలపాతాలు, సరస్సులు టూరిస్టులను కనువిందు చేస్తాయి. అంతేకాదు ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, వివిధ నదులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరీ చలిగాను, వేడిగాను లేకుండా సమస్థాయి వాతావరణం కలిగి ఉండే ఫిబ్రవరిలో ఈ ప్రదేశాలను సందర్శించడానికి యాత్రికులు ఆసక్తి చూపుతుంటారు.

కసౌలీ, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన, అందమైన పర్వత ప్రాంతాలలో కసౌలీ కూడా ముఖ్యమైంది. ఈ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, ఎగుడూ దిగుడు లోయలు ఆకట్టుకుంటాయి. వీటిని చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యోదయం వేళలు సందర్శకులలో మధురానుభూతిని కలిగిస్తాయి.

ఉదయ్‌పూర్, రాజస్థాన్

రాజస్థాన్‌లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం ఉదయ్‌పూర్. అందమైన సరస్సులతో కూడిన ఈ నగరం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి సరస్సుల్లో బోట్ షికారు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతుంటారు. అంతేగాక ఇక్కడి చారిత్రక కట్టడాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.



Next Story

Most Viewed