Translation gloves : చేతి సైగలను సైతం మాటలుగా మార్చే హ్యాండ్ గ్లోవ్స్.. ఇద్దరు విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ

by Javid Pasha |

Translation gloves : చేతి సైగలను సైతం మాటలుగా మార్చే హ్యాండ్ గ్లోవ్స్.. ఇద్దరు విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ

Translation gloves : చేతి సైగలను సైతం మాటలుగా మార్చే హ్యాండ్ గ్లోవ్స్.. ఇద్దరు విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : బధిరులు మాట్లాడుకోవడం మీరెప్పుడైనా గమనించారా? వీరు చేతి సైగల ద్వారానే మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా మూగ, చెవిటి వంటి ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల మధ్య ఇదే ప్రధానమైన సంభాషణ. అయితే ఈ విధమైన చేతి సంజ్ఞలు బధిరులు కానటువంటి వారికి దాదాపు అర్థం కావు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని అధిగమించాలన్న లక్ష్యంతోనే యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు కొత్త ఆవిష్కరణకు తెరతీశారు. ఏంటంటే.. సైగలను మాటల రూపంలోకి ట్రాన్స్‌ఫర్ చేయగల వియరబుల్ గ్లోవ్స్‌(Wearable gloves)ను డెవలప్ చేశారు.

కొన్ని ఆవిష్కరణలు అంతే.. పరిస్థితుల ప్రభావం నుంచి, ప్రజల అవసరాల నుంచి పుట్టుకొస్తుంటాయి. 2016లో థామస్ ప్రయోర్ అండ్ నవీద్ అజోడీ అనే ఇద్దరు స్టూడెంట్స్‌ విషయంలో అదే జరిగింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుతున్న వీరు మూగ, చెవిటి వంటి వైకల్యం కలిగిన వ్యక్తుల చేతి సంజ్ఞల సంభాషణలు ఇతరులు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏం చేయాలనేదానిపై ఫోకస్ చేశారు. ఇంకేముంది సైన్ అలౌడ్ (Sign Aloud) అనే స్మార్ట్ గ్లోవ్స్‌ను రూపొందించారు. ఇందులోని సెన్సార్లు చేతి కదలికలలు, వాటి స్థానం(location), దిశ(direction)ను గుర్తిస్తాయి.

సైన్ అలౌడ్ స్మార్ట్ గ్లోవ్స్ (Sign Aloud Smart Gloves) వాటిని ధరించిన వ్యక్తుల సంజ్ఞల ద్వారా గ్రహించిన సమాచారాన్ని వైర్ లెస్‌గా కంప్యూటర్‌కు పంపుతాయి. తర్వాత అక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఈ వీటిని ఎనలైజ్ చేసి, సంబంధిత పదాన్ని లేదా వాక్యాన్ని గుర్తించి దానిని స్పీకర్ లేదా హెడ్ ఫోన్స్ ద్వారా ధ్వనిగా ప్రసారం చేయడం ద్వారా సంజ్ఞలను(Sign language) సంభాషణగా మారుస్తాయి. అయితే ప్రస్తుతానికి ఈ గ్లోవ్స్ పూర్తి స్థాయి ట్రాన్స్‌లేషన్ సిస్టమ్స్(full-fledged translation system)కావు. ప్రాథమిక స్థాయి వాక్యాలను అనువదించడంలో మాత్రమే సహాయపడతాయి. సంజ్ఞలను ఉపయోగించే వ్యక్తులు, వినికిడి సామర్థ్యం ఉన్న వ్యక్తుల మధ్య సంభాషణను సులభతరం చేస్తాయి.

Next Story