- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : వాకింగ్ శారీరక కదలిక మాత్రమే కాదు.. అదొక సూపర్ పవర్ అంటున్న న్యూరో సైంటిస్టులు
Health : వాకింగ్ శారీరక కదలిక మాత్రమే కాదు.. అదొక సూపర్ పవర్ అంటున్న న్యూరో సైంటిస్టులు

దిశ, ఫీచర్స్ : వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అందుకే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలైనా నడవాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇదొక శారీరక కదలిక మాత్రమే కాదు, అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ పవర్ అంటున్నారు న్యూరో సైంటిస్టులు. అది మెదడును ప్రభావితం చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని, క్రియేటివిటీని పెంచుతుందని చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
*వాకింగ్(Walking) చేస్తున్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్(Hippocampus), ఫ్రంటల్ కార్టెక్స్ వంటి భాగాలు యాక్టివేట్ అవుతాయి. దీంతో జ్ఞాపకశక్తి(memory) పెరుగుతుందని, విషయాలను నేర్చుకునే సామర్థ్యం మెరుగువుతుందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్టులు అంటున్నారు. వీరి అధ్యయనం ప్రకారం.. 20 నిమిషాల వాకింగ్ మెదడులో రక్త ప్రసరణ(Blood circulation in the brain)ను మెరుగుపరిచి, న్యూరో ప్లాస్టిసిటీని ప్రోత్సహిస్తుంది. దీంతో మెదడు కొత్త విషయాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, సృజనాత్మకత(Creativity)ను, నిర్ణయాత్మక ఆలోచనలను పెంచుతుంది.
2014 నాటి ఒక అధ్యయనం ప్రకారం కూడా డైలీ వాకింగ్ చేస్తున్నవారు, వాకింగ్ చేయనివారితో పోలిస్తే 60% ఎక్కువగా క్రియేటివ్ ఆలోచనలను కలిగి ఉంటున్నారు. అంటే నడక మెదడలో డైవర్జంట్ థింకింగ్‌ను ప్రేరేపిస్తుందని, కొత్త ఆలోచనలను, వినూత్న పరిష్కారాలను రూపొందించడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా వాకింగ్ చేస్తున్నప్పుడు బాడీ రిథమిక్ కదిలికలో ఉంటుంది కాబట్టి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ సమయంలోఎండార్ఫిన్స్(Endorphins), సెరోటోనిన్(Serotonin) వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి. ఒత్తిడి ఆందోలనలను తగ్గిస్తాయి. పాజిటివ్ ఆలోచనలను పెంచుతాయి. ఇక హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం అయితే రోజుకు 30 నిమిషాల నడక డిప్రెషన్ లక్షణాలను 55% తగ్గిస్తుంది.
Read More..
Sleeping Habits : ఆలస్యమే అమృతం..! లేటుగా నిద్ర లేచేవారిలోనే IQ ఎక్కువట!!






