- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసులు కురిపించే.. బొమ్మల అంగడి.!
బొమ్మలతో సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్ అయింది.

కాసులు కురిపించే.. బొమ్మల అంగడి.!
చిన్న పిల్లలకు పక్కన అమ్మ ఉన్నా సరే..
ఆడుకోవడానికి బొమ్మ కావాలి.
బొమ్మకోసం బొంబాయ్ పోయి తీసుకురా అంటారు.
అలా సరదాగా తన బిడ్ కోసం బొమ్మలు తయారుచేసిన ఒక మహిళ..
ఇప్పుడు అవే బొమ్మలతో సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్ అయింది.
- దిశ, ఫీచర్స్
బిజినెస్ ప్లాన్ లేదు. కనీసం తాను చేసే వ్యాపారినికి ఒక పేరు పెట్టాలనే ఆలోచన కూడా లేదు. సరదాగా బొమ్మలు కుట్టడం స్టార్ట్ చేసింది. అదికూడా తన పాప కోసం. ఆ సరదానే బిజినెస్ వైపు తీసుకెళ్లింది. కట్ చేస్తే.. ఇప్పుడామె ఆ బొమ్మలోనే నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తోంది. అదెలాగో చూద్దామా.?
కార్పొరేట్ జాబ్ వదిలేసి
వీనా పీటర్‌ది చెన్నయ్. ఉమెన్స్ క్రిస్టయన్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ చేసింది. హ్యూమన్ రిసోర్సెస్‌లో మాస్టర్స్ చేసింది. బ్రిటీష్ ఎయిర్ వేస్.. లుఫ్తాన్సా కారట్‌లేన్ వంటి సంస్థలలో సుమారు దశాబ్దం పాటు కస్టమర్ సపోర్ట్‌లో పనిచేసింది. 2015లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసింది. మొదట్లో తన భర్త ఎడ్యుకేషనల్ స్టార్టప్‌కు సహాయం చేస్తూ తన మార్గాన్ని వెతకడం ప్రారంభించింది. అదే సమయంలో కూతురు పుట్టింది. ఆమె పేరు తార. ఖాళీగా ఏం కూర్చుంటాం.. పాపకోసం కొన్ని బొమ్మలు తయారుచేద్దామని మెల్లిమెల్లిగా ఎకో ఫ్రెండ్లీ డాల్స్ తయారుచేయడం ప్రారంభించింది.
అందరూ కావాలన్నారు
తార పుట్టిన తర్వాత బెంగళూరుకు షిఫ్టయ్యారు. అమ్మతనాన్ని ఆలోచనాత్మకంగా ఉండేలా చూసుకుంది. పాపను ఫోన్లు.. టీవీలు.. ట్యాబ్‌లు.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా పెంచాలనుకుంది. అందుకోసం వీనా కూడా ఫోన్ వాడకాన్ని మాగ్జిమమ్ తగ్గించింది. పూర్తి దృష్టి బొమ్మల తయారీపైనే పెట్టింది. తీరొక్క బొమ్మలు చేతితో కుట్టి ఫ్రెండ్స్‌కు చూపించేది. ఫ్రెండ్స్‌కు వీనా హ్యాండ్‌మేడ్ బొమ్మలు చాలా నచ్చాయి. మాక్కావాలి అంటే మాక్కావాలి అని అందరూ ఆమెతో బొమ్మలు కుట్టించుకున్నారు. అలా వీనా బొమ్మలు కుట్టే పనిలో బిజీ అయిపోయింది. ఇల్లంతా ఎక్కడ చూసినా తను కుట్టిన బొమ్మలే కనిపిస్తున్నాయి.
తారా డాల్ హౌజ్
అప్పటికీ బిజినెస్ ఆలోచనే లేదు. కానీ తన హ్యాండ్‌మేడ్ బొమ్మలనే మార్కెట్లో పెడితే మంచి బిజినెస్ అవుతుందని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. ఒకసారైతే చూద్దాం అనుకొని 30 ఎకో ఫ్రెండ్లీ బొమ్మలను కుట్టింది. వాటిని ఎంతకు అమ్మాలో కూడా ఆమెకు తెలియదు. ఒక పేరు కూడా అనుకోలేదు. మార్కెట్‌కు తీసుకెళ్లిన బొమ్మలు నిమిషాల్లో అమ్ముడుపోయాయి. వీనా ఆశ్చర్యపోయింది. ఏంటీ నా బొమ్మలు ఇంత క్రియేటివ్‌గా ఉన్నాయా అని లోలోపల మురిసిపోయి.. ఇక్కడితో ఆగిపోవద్దని డిసైడయ్యింది. బెంగళూరులోనే "తారా డాల్ హౌజ్"ను ఓపెన్ చేసింది.
నెలకు రూ. 2 లక్షలు
బొమ్మల వ్యాపారమైతే స్టార్ట్ చేసింది కానీ.. హ్యాండ్ మేడ్‌తోనే కంటిన్యూ చేయాలా.. వేరే రూట్ ఎంచుకోవాలా అనే సందిగ్ధం పోలేదు. మార్కెట్‌ను స్టడీ చేసింది. ప్లాస్టిక్.. సింథటిక్ బొమ్మల జోలికి అస్సలు పోవద్దనుకుంది. అవి ఎక్కువకాలం నిలవవు.. ఇంకా సౌకర్యవంతంగా ఉండవు. మరీ ముఖ్యంగా పర్యావరణహితం కావు. బాగా ఆలోచించి స్క్రాప్ ఫాబ్రిక్.. మెత్తటి ఊలుతో బొమ్మలు కుట్టి అమ్మడం ప్రారంభించింది. "తారా డాల్ హౌజ్" అంటే బెంగళూరులో చేతితో కుట్టే మెత్తటి బొమ్మలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇప్పుడామె ఆదాయం నెలకు రూ.2 లక్షలు.
సెల్ఫ్ ట్రెయిన్డ్
బొమ్మలను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది.. ఆదరణ బాగుంది కాబట్టీ బిజినెస్ స్టార్ట్ చేసింది కానీ.. వీనాకు దీని గురించి ఎలాంటి అవగాహన లేదు. పిన్టెరెస్ట్.. యూట్యూబ్ వంటి మాధ్యమాలను స్టడీ చేసి రాగ్ డాల్స్ తయారీని స్వయంగా నేర్చుకుంది. ప్రతీ బొమ్మను కాటన్‌పై నమూనా గీసి.. చేత్తో కత్తిరించి కుడుతారు. ఒక్కసారి కడిగినా కుంచించుకుపోని కాటన్- పాలిస్టర్ మెటీరియల్ వాడతారు.






