వామ్మో.. ఈ మ్యాథ్స్ సార్ యాక్షన్ హీరోలా ఉన్నాడే.. అలా తన్నాడేంట్రా.. క్లాస్‌ డిస్టర్బ్ చేసినోళ్లకు కరెక్ట్ మొగుడే.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-08 11:52:23  IST  )

స్టూడెంట్స్ క్లాస్ డిస్టర్బ్ చేయడం కామన్.. సార్‌కు కోపం రావడం కామన్.. కానీ మరీ ఇంత కోపమా? బాబోయ్ ఈ మ్యాథ్స్ సార్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. క్లాస్

వామ్మో.. ఈ మ్యాథ్స్ సార్ యాక్షన్ హీరోలా ఉన్నాడే.. అలా తన్నాడేంట్రా.. క్లాస్‌ డిస్టర్బ్ చేసినోళ్లకు కరెక్ట్ మొగుడే.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : స్టూడెంట్స్ క్లాస్ డిస్టర్బ్ చేయడం కామన్.. సార్‌కు కోపం రావడం కామన్.. కానీ మరీ ఇంత కోపమా? బాబోయ్ ఈ మ్యాథ్స్ సార్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. క్లాస్ డిస్టర్బ్ చేసిన విద్యార్థులను దంచిపడేసిండు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ వీడియో చూస్తే వెస్టర్న్ కంట్రీస్‌కు చెందినట్లుగా అనిపిస్తుండగా.. ఓ అమ్మాయి పక్కన కూర్చున్న అబ్బాయిని మరో గ్యాంగ్ అబ్బాయిలు ఎటాక్ చేశారు. అది కూడా సార్ క్లాస్ చెప్తుండగానే.. వెళ్లి ఆ పిల్లాడి మీద వెనుక నుంచి ఒకరు దాడి చేస్తే పక్క నుంచి వచ్చి మరొకరు కొట్టారు.

దీన్నంతా గమనిస్తూనే క్లాస్ చెప్తున్న మాష్టారుకు చిర్రెత్తుకొచ్చింది. ఒకేసారి యాక్షన్ హీరోలా మారిపోయాడు. పొట్టు పొట్టు కొట్టిండు. చెంప మీద ఒకరిని కొడితే.. ఇంకొకరిని ఫుల్లు ఫోర్స్‌తో తన్నాడు. మరొకరిని నెట్టేస్తే పోయి గేట్ బయట పడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘బాబోయ్ ఈయన మా మ్యాథ్స్ సార్ కంటే డేంజర్ ఉన్నాడేంట్రా బాబు’’, ‘‘క్లాస్ డిస్టర్బ్ చేసినోళ్లకు కరెక్ట్ మొగుడు.. ఇలాంటి టీచర్స్ ప్రతీ స్కూల్‌లో ఉండాలి’’, ‘‘అలా తన్నాడేంట్రా బాబు’’, ‘‘ఈ జనరేషన్‌కు ఇలాంటోళ్లే కరెక్ట్’’, ‘‘స్టంట్ మాస్టర్ లెక్చరర్ అయిపోతే ఇలాగే ఉంటదేమో’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story