- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలు నుండి తప్పించుకున్న పిల్లి.. హవ్వా..! ఇంత ఈజీనా (వీడియో)
by Batti.Sumithra |
రీమిక్స్ వెర్షన్ వీడియోను మరింత హాస్యాస్పదంగా మార్చింది. This kitty reminded people of the series Prison Break.

X
దిశ, వెబ్‌డెస్క్ః 2015లో విడుదలైన 'ప్రిజన్ బ్రేక్' సిరీస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సిరీస్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక జంతువులు కూడా తమ తెలివితేటలతో ప్రిజన్ బ్రేక్ చేయగలవని నిరూపించింది ఓ క్యూట్ కిట్టీ. ఈ వీడియోలో ఒక పిల్లి యజమాని బంధించిన గ్రిల్స్ జైలు నుండి ఎలా తప్పించుకుందో చూడొచ్చు. ఏసీ, లియా, చోంకీ అనే మూడు పిల్లుల సాహసాలతో నిండిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సదరు వీడియో పోస్ట్ చేయగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే మిషన్ ఇంపాజిబుల్ థీమ్ సాంగ్ రీమిక్స్ వెర్షన్ వీడియోను మరింత హాస్యాస్పదంగా మార్చింది. ఇక, నెటిజనులను బాగా ఆకట్టుకున్న ఈ వీడియోకు లైకుల వర్షం కురుస్తోంది. చాలా మంది ఈ పిల్లి 'ప్రిజన్ బ్రేక్' సిరీస్‌ని గుర్తుకు తెస్తుందంటూ మెచ్చుకుంటున్నారు.
Next Story






