- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gorintaku: గోరింటాకు పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే..!
ఆయుర్వేదంలో గోరింటాకును ఎక్కువగా ఉపయోగిస్తారు.

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్ట పడతారు. ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమైపోయింది. అయితే, పెళ్లిళ్లు జరిగేటప్పుడు గోరింటాకు కచ్చితంగా పెట్టుకుంటారు. స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే.. వారి అందం రెట్టింపు అవుతుంది. గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వెనక ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో గోరింటాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే, దీనిలో మన చర్మానికి మంచి చేసే రసాయనాలు ఉంటాయి. అవి మన శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే, చర్మ వ్యాధులకు కూడా చెక్ పెడతాయి.గోరింటాకు గోర్లకి చాలా మేలు చేస్తుంది. దీనిలో లాసోన్ అనే రసాయనం ఉంటడం వలన ఎర్రగా పండుతుంది. అలాగే, దీని నీటిని మన శరీరం గ్రహించి ఆవిరి చేస్తుంది. గోరింటాకు ఎండే కొద్దీ దానిలో ఉండే రసం శరీరంలోని పొరల్లోకి వెళ్ళి ఎర్రగా మారుతుంది. ఇక ఆషాడమాసంలో గోరింటాకుకు డిమాండ్ పెరుగుతుంది. ఆ సమయంలో కొనుక్కొని మరి పెట్టుకుంటారు. ఇదే సమయంలో వర్షాలు పడటం వలన మన కాళ్లు చేతులు వర్షపు నీటిలో తడవడం వలన చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. అప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వలన ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏడాదికొకసారైనా గోరింటాకు పెట్టుకోవాలి .. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






