Virat Kohli and Anushka Sharma: ఇండియా వద్దు.. లండన్‌ ముద్దు..! విరాట్‌, అనుష్క దంపతుల నిర్ణయానికి కారణం ఇదే

by Vennela |

Virat Kohli and Anushka Sharma: సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలతో కలిసి భారత్ నుంచి వెళ్లిపోతున్నారా?

Virat Kohli and Anushka Sharma: ఇండియా వద్దు.. లండన్‌ ముద్దు..! విరాట్‌, అనుష్క దంపతుల నిర్ణయానికి కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli and Anushka Sharma: సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలతో కలిసి భారత్ నుంచి వెళ్లిపోతున్నారా? వెళ్లిపోయారా? లండన్ లో స్థిరపడ్డారా? అంటే కచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన భర్త డాక్టర్ శ్రీరామ్ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. విరాట్, అనుష్కల నిర్ణయం వెనుకున్న కారణాన్ని కూడా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ తెలిపారు. గత ఏడాది నుంచి అనుష్క తన పిల్లలతో కలిసి లండన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కోహ్లీ లండన్ వెళ్లి వస్తున్నారట.

గత ఏడాది కోహ్లీ తన భార్య, పిల్లలతో కలిసి లండన్ లో తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాగే కొందరు సన్నిహితులు కూడా కోహ్లీ ఫ్యామిలీ లండన్ లో నివసిస్తున్నట్లు ధ్రువీకరించారు. వారి నిర్ణయం వెనకున్న కారణాన్ని తాజాగా డాక్టర్ శ్రీరామ్ వెల్లడించారు. తమ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి, పిల్లలను సాధారణంగా పెంచడం కోసం కోహ్లీ, అనుష్క కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కోహ్లీ, అనుష్క భారత్ లో స్వేచ్ఛగా తమకు నచ్చినట్లుగా తిరగలేరు. సరదాగా బయటకు వెళ్లి గడపడం అస్సలు కుదరదు. అలాగే వారి పిల్లలకు కూడా భారత్ లో ప్రైవసీ అనేది ఉండదు.

వీరిద్దరు భారత్ లో ఏం చేసినా అది అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తుంది. వారు తమ పిల్లలకు కెమెరాలకు దూరంగా సాధారణంగా పెంచాలనుకుంటున్నారు. వారి నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఒక సెలబ్రిటీగా నా భార్య ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి అనుష్క, విరాట్ సరైన నిర్ణయమే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అని శ్రీరామ్ పేర్కొన్నారు. కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.


Next Story