పైల్స్ (మొలలు) సమస్యకు చెక్ పెట్టే ఏకైక పండు ఇదే!

by Disha Web Desk 9 |
పైల్స్ (మొలలు) సమస్యకు చెక్ పెట్టే ఏకైక పండు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: పైల్స్ వ్యాధి ప్రస్తుత రోజుల్లో చాలా సాధారణ సమస్యగా మారింది. దీనినే హెమోరాయిడ్స్ అని కూడా పిలుస్తారు. జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పు కారణంగా ఎక్కువశాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి ఇతరులకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాగే వైద్యుడి దగ్గరకు వెళ్లడానికి కూడా కొంతమంది మొహమాటంతో ఆగిపోతారు. అయితే ఈ పైల్స్ సమస్యను నియంత్రించడానికి అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుందట. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

* అరటిపండులో వివిధ పోషకాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

* ఈ పండులో పొటాషియం, విటమిన్ సి, మాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

* అందుకే అరటిపండ్లను పైల్స్ ఫ్రెండ్లీ ఆహారంగా చూస్తారు.

* అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.

* ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.

* అలాగే ప్రేగు కదలికల సమయంలో ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

* పైల్స్ రాకుండా ఉండాలంటే తాజాగా ఉన్న, పూర్తిగా పండిన బనానాని తినాలి.

* సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలు సక్రమంగా బాడీకి అందడానికి మేలు సహాయపడుతుంది.

* అరటిపండ్లను ఇతర ఆహారాలతో కాకుండా నేరుగా తినడం వల్ల దానిక ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి.

* అలాగే తినేటప్పుడు పూర్తిగా నమిలి తినాలి.

* దీంతో పైల్స్ సమస్యకు మీ దరి చేరకుండా ఉంటుంది.

Also Read... వివాహిత పురుషుల్లో వర్క్‌ప్లేస్ బర్నవుట్ తక్కువ.. కారణం అదేనట!


Next Story