ఇల్లు కావాలా.. ఐతే ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనేయండి.!

by Daayi Srishailam |

మిగితా మెట్రో నగరాల్లో ఇండ్లకు భారీ ధరలు

ఇల్లు కావాలా.. ఐతే ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనేయండి.!
X

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.

భూముల ధరలు, నిర్మాణ వ్యయం పెరగడంతో..

ఇండ్ల ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి.

దేశంలోని మిగితా మెట్రో నగరాలతో పోలిస్తే

హైదరాబాద్ పరిసరాల్లో ఇండ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

- దిశ, మేడ్చల్ బ్యూరో

ముంబై కంటే తక్కువ

హైదరాబాద్ భారీగా విస్తరిస్తోంది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు మూడో నగరం (సైబరాబాద్) ఏర్పడింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఫోర్త్ (ప్యూచర్)సిటీ అవిర్భవించబోతుంది. దీంతో శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యన మధ్యతరగతి వారు కొనగలిగే స్థాయిలో ఇండ్ల ధరలు ఉన్నాయని పలు రియల్ రంగ నిపుణలు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లోని ఐటీ హబ్ ఉన్న వెస్ట్ జోన్ పరిసరాల్లో మాత్రం ఇంటి ధరలు భారీగానే ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, గండిపేట, కోకాపేట్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ వంటి ప్రాంతాలతోపాటు సెంట్రల్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్,షేక్ పేట్ వంటి ప్రాంతాల్లో ప్రీమియం వంటి ధరలు సగటున చదరపు అడుగు రూ.15 వేల వరకు ఉండగా, అదే ముంబైలో ప్రీమియం ఇంటి ధరలు సగటున చదరపు అడుగులు రూ.25వేల వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ముంబైతో పోలిస్తే హైదరాబాద్ లో ఇంటి ధరలు తక్కువగానే ఉన్నాయని ఎస్వీ కనస్ట్రక్షన్ అధినేత శ్రీనివాస్ రావు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇంటి ధర సుమారుగా రూ. కోటిన్నర నుంచి మొదలవుతోంది.

ఇప్పుడే కొనేయండి...

గ్రేటర్ శివారు పరిసరాల్లో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో సగటున ఇంటి ధర రూ. 4,500 ఫర్ ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్ సమీప జిల్లాలైన మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో మధ్య తరగతి వారు కొనుక్కో గలిగే ఇళ్ల ధరలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ నార్త్, ఈస్ట్ లలో ఓఆర్ఆర్ వెలుపల ఇంటి సగటున రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల్లో మొదలవుతోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత నెమ్మదించినా.. రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్ శివారులో ఎక్కడా భూముల ధరలు, అపార్ట్ మెంట్లు, విల్లాల ధరలు తగ్గలేదని, ఇకపోతే ప్రాంతాన్ని బట్టి 5 నుంచి 8 శాతం ఇంటి ధరలు పెరిగాయి. అందుకే ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాయల్ బిల్డర్స్ అధినేత రాయల మోహన్ రావు సూచిస్తున్నారు.

Next Story