తప్పుడు నెంబర్లకు డబ్బులు పంపారా.. అయితే ఇలా తిరిగి పొందవచ్చు

by Malleboina Mahesh |

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌లలో డబ్బు పంపే ముందు వివరాలను రెండు, మూడు సార్లు చెక్‌ చేస్తాం. అయినా కూడా, కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి.

తప్పుడు నెంబర్లకు డబ్బులు పంపారా.. అయితే ఇలా తిరిగి పొందవచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: పెరిగిన టెక్నాలజీ, డిజిటలైజేషన్ కారణంగా ప్రతి పనికి ప్రజలు తమ సెల్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. దేశ రాజధాని అయిన, మారుమూల అటవీ ప్రాంతం అయినా సరే ఒక్క క్లిక్ తో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నాము. ఈ ఆన్‌లైన్‌ లావాదేవీలలో అందరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌లలో డబ్బు పంపే ముందు వివరాలను రెండు, మూడు సార్లు చెక్‌ చేస్తాం. అయినా కూడా, కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి. మీరు పొరపాటున డబ్బును తప్పుడు నెంబర్లు, తప్పుడు బ్యాంక్ ఖాతా లేదా UPI ID కు పంపితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేస్తే మీరు మీ డబ్బు తిరిగి పొందవచ్చు.

లావాదేవీ రసీదు (Transaction receipt)

UTR నంబర్ (Unique Transaction Reference)

లావాదేవీ తేదీ వంటి వివరాలు ఇవ్వాలి.

అనంతరం యాప్‌ సపోర్ట్ టీమ్‌ మీ ఫిర్యాదును నమోదు చేసుకొని NPCI (National Payments Corporation of India) ద్వారా రిఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. లావాదేవీ వివరాలు సరైనదైతే, చాలా సందర్భాల్లో డబ్బు కొన్ని రోజుల్లోనే తిరిగి మీ అకౌంట్‌లోకి వస్తుంది. యాప్‌ ద్వారా సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో, మీరు NPCI వెబ్‌సైట్‌లోని “Dispute Redressal Mechanism” విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. NPCI వివరాలను పరిశీలించి, మీ లావాదేవీ చెల్లుబాటు అయిందని తేలితే, సంబంధిత బ్యాంకుకు డబ్బు తిరిగి ఇవ్వాలని సూచిస్తుంది.

తప్పుగా జరిగిన UPI లావాదేవీని రివర్స్ చేసుకునే మార్గాలు

1. UPI యాప్ ద్వారా

*యాప్ ఓపెన్ చేసి Transaction History లోకి వెళ్ళండి.

*తప్పుగా పంపిన లావాదేవీని ఎంచుకోండి.

*“Raise a Complaint” లేదా “Report a Problem” పై క్లిక్ చేయండి.

*“Wrong UPI Transaction” అనే ఆప్షన్ ఎంచుకుని (ID, తేదీ, UPI ID) వంటి వివరాలు ఇవ్వండి.

2. బ్యాంక్‌ను సంప్రదించడం ద్వారా..

*యాప్ ద్వారా పరిష్కారం కాకపోతే, బ్యాంక్ కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్‌ను సంప్రదించి,

*Transaction ID

*Beneficiary account/UPI ID

*తేదీ, సమయం వంటి వివరాలు అందించండి.

*బ్యాంక్ NPCI ద్వారా రివర్సల్ ప్రక్రియను ప్రారంభిస్తుంది.

3️. NPCI హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా..

*1800-120-1740 — ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా నేరుగా NPCIకి ఫిర్యాదు చేయవచ్చు.

Next Story