- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మొహమాటం మోతాదు మించితే అంతే ఇక..!!

దిశ, ఫీచర్స్: మొహమాటం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజంలో ఒంటరిగానే మిగిలిపోతాడు. ఇతరులకు మాట ఇవ్వడం, దాన్ని నిలుపుకోవడం మంచి పద్ధతే. కానీ, ఆ మాటముందు ‘మొహం’ చేర్చితే అదే ‘మొహమాటం’ అవుతుంది. మొహమాటం అనేది మంచిది కాదని ఎవ్వరూ అనరు. కానీ, అది ఎంతవరకు ఉండాలో, అంత వరకే ఉండాలి. అతి మొహమాటానికి పోయి లేనిపోని బాధ్యతలను నెత్తిపై వేసుకోకూడదు. ఒకరికి సహాయపడాలనే ఆలోచన చాలా మంచిది. కానీ, వీలుకానప్పుడు కాదని చెప్పడం ఉత్తమం. అతి మొమమాట పడి, అవతలి వాళ్లు ఏం అనుకుంటారో అని ఇష్టం లేని పనిని చేయడం లేదా వాళ్ల పని మీరు చేస్తే ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఇతరులు చెప్పింది ఏదైనా అది మీ సొంత పని, సమయాన్ని త్యాగం చేసి మరీ చేయాల్సిన అవసరం లేదు. పదే పదే ఇలాంటివి జరిగితే సున్నితంగా చేయలేననే చెప్పడం మంచిది. మొహమాటానికి పోయే అవతలి వారు చెప్పిన ఏదో ఒక పని చేసి, తరువాత తీరిగ్గా కూర్చొని దాని గురించి బాధపపడం లాంటివి చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇది మాత్రం మంచిది కాదు. ఇది మీ శక్తిని, సమయాన్ని వృద్ధా చేస్తుంది. ఈ మొహమాటం నుండి ఎలా భయటపడాలో ఇప్పుడు తెలుసుకోండి.
ఇతరుల గురించి ఆలోచించడం ఆపేయండి:
చాలామంది ఇతరులు ఏమనుకుంటారా అనే ఆలోచనతో వారు చెప్పింల్లా చేస్తుంటారు. వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏ వ్యక్తి అయితే తన విలువల గురించి స్పష్టంగా తెలుసుకుంటాడో అతను ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడు. మొహమాట పడుతూ స్పష్టత లేకుండా ఇతరుల పనిని చేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి నిర్మొహమాటంగా కుదరదనే చెప్పండి. కుదరదని చెప్పడం వల్ల వాళ్లు చెడుగా అనుకుంటారేమో అనే భావన మొహమాటానికి గురిచేస్తుంది. ఇలా చెప్పడం తప్పేమీ కాదు. ఇది వాళ్లు అర్థం చేసుకోగలరు. ఒకవేళ అలా అర్థం చేసుకోని వాళ్లు అయితే ఏదో ఒక మాట పెడసరిగా అంటారు. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు.
హక్కులను కాపాడుకోండి:
ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యక్తి కొన్ని హక్కులు, ఇష్టాలు, అభిప్రాయాలను కలిగి ఉంటాడు. వాటిని ఎప్పటికప్పుడూ కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఆ హక్కులకు వ్యతిరేకంగా ఉన్న పనిని, ఇతరులు చేయమంటారో అప్పుడు తప్పనిసరిగా వారితో కుదరదనే చెప్పాలి. ఆ పనిని తాను చేయలేననే చెప్పడం మంచిది. ప్రతీ వ్యక్తి తన అభిప్రాయాలు ఇతరులకు స్పష్టంగా తెలియజేయాలి. అవి కొందరికి నచ్చకపోవచ్చు. అలా కొందరు గౌరవించకపోయినా మంచి వ్యక్తిత్వము ఉన్న వ్యక్తిగా జీవించాలి. ఇలా ఉండడం వల్ల ఎంతో మంది గౌరవిస్తారు.
పరిచయాలు పెంచుకోండి:
కొందరు ఇతరులతో మాట్లాడాలంటే సిగ్గు పడతారు. దాని వల్ల నలుగురిలో ఎక్కువగా కలవలేక ఎన్నో అవకాశాలను కోల్పోతారు. చాలామందిలో ఈ మొహమాటం ఎక్కువ అవ్వడానికి కారణం పరిచయాలు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. నలుగురితో మాట్లాడి మీ అభిప్రాయాలను వారితో పంచుకోవడం వల్ల మొహమాటం అనే మాట దరిచేరదు.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్త:
స్నేహితులు లేదా బంధువులు, ఇంటి దగ్గర ఉన్న వారు ఎవ్వైనా సరే డబ్బు సహాయం చేయమని అడుగుతుంటారు. అవతలి వాళ్లకు సహాయం చేయడం మంచిదే. కానీ, ఆర్థిక విషయాల్లో మీకు లేకపోయినా అవతలి వారికి అవసరం కదా అని అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవడం మంచిది కాదు. అప్పులు ఇప్పించడం, ష్యూరిటీలు ఇవ్వడం వంటివి మీరు ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉంటేనే చేయండి. అడిగారు కదా అని మొహమాటానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి.