- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Christmas: క్రిస్మస్ సెలబ్రెషన్స్‌కు ఈ ప్లేస్‌లు బెస్ట్..!
దిశ, ఫీచర్స్: క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే చాలామందికి విదేశాలే గుర్తొస్తుంటాయి. అందుకే చాలామంది క్రిస్మస్ సమయంలో విదేశాలకు వెళ్లి వేడుకలను జరుపుకుంటారు. అయితే, మన దేశంలోనే కొన్ని ప్రదేశాలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతాయి. క్రిస్మస్ టైమ్‌లో ఈ ప్లేస్‌లలో సందడి కూడా బాగుంటుంది. అవి ఏవో ఇక్కడ తెలుసుకోండి.
గోవా: డిసెంబర్ నెలలో సందర్శించడానికి గోవా మంచి ప్లేస్. ఇక్కడ క్రిస్మస్, న్యూయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ చర్చిలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. క్రిస్మస్ పార్టీలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. నైట్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి వేళలలో ఇక్కడి వీధులన్నీ మిరువిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోతుంటాయి.
షిల్లాంగ్: క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలను గ్రాండ్‌గా జరుపుకుంటారు. పండుగ వేళ వీధులన్నింటినీ లైట్లతో అలంకరిస్తారు. రాత్రి వేళలలో అవి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆటపాటలతో అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా క్రిస్మస్‌ను జరుపుకుంటారు.
కేరళ: దక్షిణాది ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే ప్రాంతాల్లో కేరళ ఒకటి. ఇక్కడ మాస్ పార్టీలు బాగా జరుగుతాయి.
పాండిచ్చేది: క్రిస్మస్ టైమ్‌లో పాండిచ్చేరి ప్లేస్ బెస్ట్. ఇక్కడ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. పండుగ సమయంలో ఫ్రెంచ్ సంస్కృతిని, వారి విధానాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. పాంగిచ్చేరిలోని పురాతన కట్టడాలు, బీచ్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఇక్కడ చర్చిలు కూడా చాలానే ఉన్నాయి.
చెన్నై: ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ చర్చీలు ఉన్నాయి. పండుగ సమయంలో వీటిని అద్భుతంగా డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ మార్కెట్ కూడా భారీగా జరుగుతుంది. ఫెస్టివల్ సమయంలో వీధులన్నీ రకరకాల లైట్లైతో మిరుమిట్లు గొలుపుతుంటాయి.