- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏం చేశారురా బాబు.. ఈ పిల్లలు డ్యాన్స్ ఇరగదీశారంతే(వీడియో)
వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మమ్మ ఇంటికి చేరి ఇష్టమైన వంటకాలు చేయించుకుంటూ.. బొజ్జ నిండా తిని.. హాయిగా పడుకుంటున్నారు.

దిశ, ఫీచర్స్ : వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మమ్మ ఇంటికి చేరి ఇష్టమైన వంటకాలు చేయించుకుంటూ.. బొజ్జ నిండా తిని.. హాయిగా పడుకుంటున్నారు. అయితే స్కూల్ లాస్ట్ డే కూడా పిల్లలకు స్పెషల్‌గానే ఉంటుంది. మళ్లీ రెండు నెలల తర్వాత ఫ్రెండ్స్‌ను కలుస్తారు కాబట్టి హ్యాపీగా స్పెండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ చిన్నారులు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి కలిసి స్టెప్స్ ఇరగదీశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘అల్లుడా మజాకా’’ సినిమా నుంచి ‘‘రెడ్ రెడ్ బుగ్గే రెడ్’’ సాంగ్‌కు మూమెంట్స్.. చించి చించి అవతలపడేశారు.
ప్రస్తుతం ఈ వీడియో షేరింగ్‌ల మీద షేరింగ్‌లతో ట్రెండింగ్‌లో ఉండగా.. లైక్స్ లక్షల్లో ఉన్నాయి. కామెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పిల్లల డ్యాన్సింగ్ స్కిల్స్ మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫుల్ వీడియో కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా అప్‌లోడ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. మెగాస్టార్ చిరు మాదిరిగానే ఈ పిల్లలు కూడా లైఫ్‌లో ఎదగాలని బ్లెస్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు మాత్రం ఇవన్నీ పక్కకు పెట్టి చదువుపై దృష్టి పెడితే బాగుంటుందని, లేదంటే లైఫ్ చుక్కలు చూపిస్తుందని ఫైర్ అవుతున్నారు.






