- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శృంగారంలో ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకూడదు..
శృంగారం పేరు వింటేనే మనసు ఉత్తేజం అవుతుంది. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆలుమగల మధ్య నిత్య శృంగారం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండటంతోపాటు ఆరోగ్యంగానూ ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం పేరు వింటేనే మనసు ఉత్తేజం అవుతుంది. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆలుమగల మధ్య నిత్య శృంగారం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండటంతోపాటు ఆరోగ్యంగానూ ఉంటారు. అయితే మనిషికి శృంగారం ఎంత ముఖ్యమే.. ఆ సమయంలో తీసుకునే జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు సైక్సాలాజిస్టులు. ముఖ్యంగా ఈ నాలుగు రకాల జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యం దరి చేరదని వివరిస్తున్నారు. ఇంతకూ ఆ నాలుగు సూత్రలు ఏంటో చూద్దాం..
ప్రైవేట్ భాగాల్లోని వెంట్రుకలను షేవ్ చేస్తున్నారా..?
యుక్త వయసు వచ్చిన యువతీయువకుల ప్రైవేట్ పార్ట్ భాగాల్లో వెంట్రుకలు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. చెడు బ్యాక్టీరియాను వృద్ధి చేయడంలో ఈ వెంట్రుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అలర్జీకి కారణం అవుతాయి. దీంతో ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పార్ట్స్ భాగాల్లో వెంట్రుకలను వెంటవెంటనే షేవ్ చేస్తుంటారు. ఇలా స్మూత్‌గా షేవ్ చేసుకోవడం వల్ల అనార్ధాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. నున్నగా షేవ్ చేయడం వల్ల అక్కడ ఉండే పొర తొలగిపోయి అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. షేవ్‌కు బదులు ట్రిమ్ చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు.
శృంగార చుంభనం డేంజరే..
శృంగార సమయంలో దేహం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. నోరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. శృంగారం సమయంలో కపుల్స్ ఇద్దరు చాలా రొమాంటిక్‌గా ఫీలవుతారు. ఆ సమయంలో అదర చుంభనమే కాదు.. దేహంలో ప్రతి పార్ట్‌ను ముద్దాడుతారు. అలాంటి సమయంలో నోటి ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దీని వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుకే శృగారానికి ముందు.. తర్వాత మౌత్‌ను వాష్ చేసుకోవాలి.
యోని శుభ్రత..
ఆడవాళ్ల ఆరోగ్యం విషయంలో యోని కీలకమైన పాత్ర పోషిస్తుందని అంటున్నారు వైద్యులు. అందుకే యోని శుభ్రతలో మహిళలు అస్సలు రాజీపడకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా లైంగిక చర్యకు ముందు.. ఆ తర్వాత కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. యోని సున్నితమైన భాగం అయినందున అక్కడ వాడే సబ్బుల్లో pH బ్యాలెన్స్‌గా ఉండే వాటిని ఎంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. యోనిని రెగ్యులర్‌గా గోరువెచ్చిన నీటితో కడుక్కుంటే మంచిది. లో దుస్తులు కూడా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.
ఆ ప్లేస్‌లో శృంగారం రక్షితం కాదా..?
కొందరు శృంగార కోరికలను ఆపుకోలేరు. ఎప్పుడు కోరిక పుడితే అప్పుడే లైంగిక చర్యలో పాల్గొంటుంటారు. మరికొందరు శృంగార కార్యం గుర్తిండేలా ప్లాన్ చేస్తుంటారు. అలా ఫాంటసీల కోసం బీచ్‌లు, మురుగు నిండిన చెరువు నీటిలో, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో శృంగారం చేస్తుంటారు. కానీ ఇలాంటి చర్య అనారోగ్యాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మురుగు నీళ్లు, అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది. ఆ ప్రదేశంలో స్త్రీ, పురుషులు సంపర్కం చేసుకుంటే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా ఒంట్లోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
More News : అమ్మాయిలు బోర్లా పడుకుంటే దాని ఆకృతి మారుతుందా..?






