Rafale Fighter Jet: శత్రు మూకలను వేటాడే డేగ రాఫెల్.. ఈ యుద్ధవిమానం ప్రత్యేకతలు ఇవే

by Vennela |   (  Updated:2025-05-09 10:41:12  IST  )

Rafale Fighter Jet: శత్రు మూకలను వేటాడే డేగ రాఫెల్.. ఈ యుద్ధవిమానం ప్రత్యేకతలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: Rafale Fighter Jet: భారత్ వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైనటువంటి యుద్ధ విమానాల్లో రాఫెల్ అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు. నిజానికి రాఫెల్ యుద్ధ విమానం ఫ్రాన్స్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరుగాంచింది. భారత్ ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాలు ఒప్పందం కుదుర్చుకొని ఈ యుద్ధ విమానాలను దిగుమతి చేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునికమైన 5th జనరేషన్ ఫైటర్ జట్టుగా పేరు ఉంది. రాఫెల్ యుద్ధ విమానాలు శత్రువుకు సైతం కనబడకుండా దాడి చేసే వేగం దీని సొంతం. తాజాగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించింది. ఇది లక్ష్యాన్ని కొట్టడంలో తనకు తానే సాటి అని చెప్పవచ్చు. ఈ రాఫెల్ యుద్ధ విమానం గురించి ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

5th జనరేషన్ యుద్ధవిమానం :

ప్రస్తుతం భారత్ లోని ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ విమానం 5th generation ఫైటర్ జెట్ గా పేరు ఉంది. ఇది ఒకేసారి ఏరియల్ కాంబాట్, గ్రౌండ్ అటాక్, నేవల్ వంటి మిషన్లలో పాల్గొనవచ్చు

సూపర్‌సోనిక్ వేగం దీని ప్రత్యేకత :

ఇది గంటకు 2,222 కిమీ వరకు వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది శత్రువుకు కనిపించకుండా దాడి చేస్తుంది. రాడార్లకు కూడా చిక్కదు.

దీని రేంజ్ ఇదే:

ఒక్కసారి ఇంధనం నింపితే 3,700 కిమీ వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది, దీని గాలి నుంచే రీఫిల్ చేసే అవకాశం ఉంటుంది.

శక్తివంతమైన ఆయుధాలు మోసుకెళ్లవచ్చు:

Meteor (ఎయిర్-టు-ఎయిర్), SCALP (ఎయిర్-టు-గ్రౌండ్), HAMMER వంటి అత్యాధునిక బాంబులు, అలాగే ఆయుధాలను తీసుకుళ్లే అవకాశం ఉంది.

అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ:

ఇందులో అత్యంత ఆధునికమైన AESA రాడార్ (Active Electronically Scanned Array) వ్యవస్థ ఉంది. ఇది వెయ్యి కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కనిపెట్టే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్:

ఇందులో ప్రత్యేకంగా SPECTRA అనే డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది శత్రు రాడార్‌లను మాయ చేయడంతో పాటు, మిసైల్స్ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఇందులో ఉంటుంది.

ట్విన్-ఇంజిన్ పవర్:

రెండు శక్తివంతమైన ఇంజిన్స్ కలిగి ఉంటుంది. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే రెండో దానితో కొనసాగుతుంది. అలాగే ఈ రాఫెల్స్ చిన్న రన్‌వేలు, హై వేలు, రిమోట్ ఎరియాల్లో కూడా ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉంది.

చీకటి, వర్షం, మంచు వంటి లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది.

Next Story