గుండె పోటు, గ్యాస్ నొప్పికి తేడాలు ఇవే.. ఈ లక్షణాలు తెలిస్తే చాలు..!

by Batti.Sumithra |   (  Updated:2023-12-19 13:35:18  IST  )

చాలామందికి మసాలా, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వలన కడుపులో, ఛాతీలో మంటతో బాధపడుతుంటారు.

గుండె పోటు, గ్యాస్ నొప్పికి తేడాలు ఇవే.. ఈ లక్షణాలు తెలిస్తే చాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలామందికి మసాలా, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వలన కడుపులో, ఛాతీలో మంటతో బాధపడుతుంటారు. హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఛాతీలో మంట వస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఛాతీమంట, గుండె పోటు ఈ రెండింటి లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. అందుకే కొంత మంది ఛాతీలో మంటలు రాగానే గుండెపోటు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య గ్యాస్ వల్లనో, గుండెపోటు వల్లనో కాదని దానికి వేర్వరు కారణాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూ వచ్చే ఛాతీమంటలు ప్రమాదకరం కాదంటున్నారు. అసలు ఈ ఛాతీ మంటలు ఎందుకు వస్తాయి, ఏ సమస్యలతో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పెప్టిక్ అల్సర్..

ఈ మధ్య కాలంలో చాలా మంది అల్సర్‌తో బాధపడుతున్నారు. అల్సర్ అనేది జీర్ణాశయంలోని చిన్నప్రేగు లోపలి ఉపరితలం పై వచ్చే పుండు. జీర్ణాశయానికి పుండ్లు అయినప్పుడు అజీర్తి, కడుపులో మంటలు, వికారం, వాంతులు, రక్తస్రావం వస్తుంటాయి. అల్సర్ తో బాధపడేవారికి తరచూ ఛాతీలో మంట ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే వారికి వైద్యులు మందులను సూచిస్తారు.

గుండెపోటు..

గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో మంటలు వస్తుంటాయి. దీంతో వారు అది సాధారణ ఎసిడిటీ మంటగానే అనుకుంటారు. కడుపులో ఎసిడిటీ ఫాం అయినప్పుడు ఛాతిలో మంట వస్తుంది. అలాగే నోరు చేదుగా మారుతుంది. కానీ గుండె జబ్బు వచ్చినప్పుడు కూడా ఛాతీలో మంట రావడం, ఒళ్లు బిగుతుగా మారడం, నొప్పి, అజీర్ణం, వికారం, వేగవంతమైన హృదయ స్పందన, చర్మం బిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఊపిరితిత్తుల సమస్యలు..

ఊపిరితిత్తులలోకి కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఛాతీ మంటతో బాధపడుతూ ఉంటారు. ఈ యాసిడ్స్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు న్యుమోనియా, శ్వాసలోపం, ఆస్తమా, లారింగైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. యాసిడ్ ఊపిరితిత్తులలోకి వెళ్లినపుడు గొంతు నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఛాతీలో మంట వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యలను సంప్రదించడం మరిచిపోవద్దు.

హెర్నియా..

హెర్నియాతో బాధపడేవారికి ఛాతీలో మంటలు వస్తుంటాయి. కడుపులోని కాస్త భాగం దిగువ దూరినప్పుడు హెర్నియా వస్తుంది. దీనికి చికిత్స అందిస్తే త్వరలోనే కోలుకుంటారు. లేదా నిరంతరం ఛాతీలో మంటలు వచ్చి అన్నవాహికకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. ఇలా దీర్ఘకాలంలో ఉంటే అది అన్నవాహిక క్యాన్సర్ లాగా మారే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

క్యాన్సర్..

పేగు క్యాన్సర్‌తో బాధపడేవారు అత్యధికంగా ఛాతీలో మంటలకు గురవుతుంటారు. క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నవాహిక లైనింగ్‌‌కు ప్రభావితం అవుతుంది. దీంతో కడుపులోకి ఆహారం ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెర్సిస్టెంట్ పెప్టిక్ ఎసోఫాగిటిస్ అన్నవాహికలో ఇబ్బందులు కలిగిస్తుంది.

Next Story