- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొమాంటిక్ సంబంధాలకంటే.. స్నేహ బంధాలకే ప్రయారిటీ.. ఆధునిక మహిళల్లో పెరుగుతున్న ధోరణి
మహిళల్లో ఆర్థిక స్వాతంత్య్రం పెరగడం, డిపెండెన్సీ తగ్గడం వంటి పరిస్థితులు.. భావోద్వేగాలు లేదా ఆచరణాత్మక అవసరాలు తీరని సంబంధాల్లో ఉండాల్సిన అవసరం లేదనే ధోరణి పెరగడానికి కారణం అవుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవన విధానాలు, లైఫ్ పర్పస్ వంటివి ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. అవి కాలానుగుణంగా మార్పు చెందుతుంటాయి. అనేక విషయాల్లో గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూసినప్పుడు ఈ తేడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక మహిళల విషయంలోనూ అదే జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. 90s కిడ్స్‌తో పోలిస్తే.. ఈతరం మహిళలు, ముఖ్యంగా జెన్ Z ,మిల్లెనియల్స్‌లో 55% మంది చాలా విషయాల్లో రొమాంటిక్ సంబంధాలకంటే.. స్నేహబంధాలను ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు, విలువైనవిగా భావిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ పురుష భాగస్వాములకంటే.. మహిళా స్నేహితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత
ఆధునిక కాలంలో చాలామంది మహిళలు స్నేహాల చుట్టూ తమ జీవితాలను నిర్మించుకోవడాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఒకప్పటిలా తమ రొమాంటిక్ మేల్ పార్ట్‌నర్ లేదా భర్తే సర్వస్వంగా బతికేయడం లేదు. తమ భాగస్వామి కోసం.. ఒకప్పటిలా ఇతర మహిళా స్నేహితులను వదులుకోవడం లేదు. పైగా అనేక విషయాలను వారితో పంచుకుంటూ.. ఎమోషనల్‌గా టచ్‌లో ఉంటున్న దోరణి క్రమంగా పెరుగుతోంది. అలాగే రొమాంటిక్ పార్ట్‌నర్ విషయంలో ఆధునిక మహిళలు నచ్చని అంశాలను నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వ్యతిరేకిస్తూ వాస్తవాలు తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఇరువైపులా అంగీకారం లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైతే విడాకులు, బ్రేకప్‌లు వంటి వాటికైనా సిద్ధపడుతున్నారు. కానీ.. ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని నచ్చని సంబంధాలను నెట్టుకొచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధ పడట్లేదు ఆధునిక మహిళలు.
కారణాలేమిటి?
రొమాంటిక్ భాగస్వాముల కంటే.. అనేక విషయాల్లో తమ స్నేహితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ఎందుకు పెరుగుతోందంటే.. ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు మారాయి. మహిళలు చదువుకొని, సమాజాన్ని, సమాజంలోని, వ్యక్తుల్లోని లోపాలను అర్థం చేసుకుంటున్నారు. దీనికి తోడు ఆర్థిక స్వాతంత్య్రం పెరగడం, డిపెండెన్సీ తగ్గడం వంటి పరిస్థితులతో భావోద్వేగాలు లేదా ఆచరణాత్మక అవసరాలు తీరని సంబంధాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. బదులుగా.. స్థిరత్వం, అవగాహన, పరస్పర మద్దతు అందించే స్నేహాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఉదాహరణకు, అమెరికన్ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం, కెరీర్, విద్య, స్నేహాలను ప్రాధాన్యత ఇస్తూ సింగిల్ లైఫ్‌ను ఎంచుకుంటున్నారు. ఇండియాలోనూ ఇటీవల ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మహిళలు స్నేహబంధాల విలువలకు ప్రయారిటీ ఇవ్వండం, నచ్చన రొమాంటిక్ జీవితాలను వదులుకోవడం, ప్రేమ, పెళ్లి వంటి విషయాలకు సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం లేదా అసలుకే పట్టించుకోకపోవడం సాధారణమై పోయింది.






