- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణ శక్తినిచ్చే PRE-WORKOUT SNACK.. వ్యాయామానికి ముందు ఎందుకు తినాలంటే..?
తక్షణ శక్తినిచ్చే PRE-WORKOUT SNACK.. వ్యాయామానికి ముందు ఎందుకు తినాలంటే..?

దిశ, ఫీచర్స్ : అరటి పండు అంటే ఇష్టపడని వాళ్లు దాదాపు ఎవరూ ఉండరు. ఇందులోని అద్భుతమైన పోషకాలు ఆరోగ్యానికి చాలామంచిది. తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. అందుకే పోషకాహార నిపుణులు వీటిని Pre-workout snack’గా కూడా పేర్కొంటారు. ఇంతకీ బనానాలో ఏయే పోషకాలు ఉంటాయి? ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం.
*తక్షణ శక్తి సరఫరా : అరిపండులో సహజ చక్కెరలు (ఫ్రక్టోస్, గ్లూకోస్) ఉంటాయి. ఇవి త్వరగా శోషించబడి(Absorbed) వ్యాయామం కోసం తక్షణ శక్తిని అందిస్తాయి.
*కార్బోహైడ్రేట్స్ : ఒక్క అరటిపండులో సుమారు 25-30 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి వర్కవుట్ సమయంలో శరీరానికి ఇంధనంగా పనిచేస్తాయి.
*పొటాషియంతో ఫుల్ బెనిఫిట్ : ఒక బనానాలో 400-450 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది కండరాల సంకోచానికి, నరాల పనితీరుకు సహాయపడుతుంది.
*తిమ్మిరి నివారిస్తుంది : పొటాషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఇది వ్యాయామ సమయంలో కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది.
*హైడ్రేషన్ సపోర్ట్ : పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
*సులభంగా జీర్ణమవుతుంది : అరటిపండు తేలికగా జీర్ణమవుతుంది. కడుపుపై భారం కలిగించకుండా వర్కవుట్ ముందు తినడానికి అనువైనవి.
*విటమిన్లు, ఖనిజాలు ఫుల్ : విటమిన్ B6 అండ్ విటమిన్ C సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియలో తగిన శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
*పోర్టబుల్ అండ్ కంఫర్టబుల్ : బనానా సులభంగా తీసుకెళ్లగలిగే ఫలం. ప్రీ-వర్కవుట్ స్నాక్‌గా ఎప్పుడైనా, ఎక్కడైనా తినవచ్చు.
*సహజ యాంటీ ఆక్సిడెంట్స్ : అరటి పండు తినడంవల్ల డోపమైన్, క్యాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
*తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ : బనానా నెమ్మదిగా, స్థిరమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇది దీర్ఘకాల వ్యాయామానికి ఉపయోగపడుతుంది. Link






