- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోషకాహార లోపం.. చలికాలంలో గర్భిణులకు మేలు చేసే ఆహారాలివే..
పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే.. గర్భిణులు ఫోలేట్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే సాధారణంగా చలికాలంలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం పెరుగుతుంది. చల్లటి వాతావరణం, ఆహారం తక్కువగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వంటివి ఇందకు కారణం అవుతాయి. ముఖ్యంగా గర్భిణులు ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
ఆకు కూరలు..
పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే.. గర్భిణులు పాలకూర(Spinach), మెంతికూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి కూడా వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రక్త కణాల నిర్మాణంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పాలకూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉండటంవల్ల రక్త హీనతను నివారిస్తాయి. అలాగే విటమిన్ ఎ, సి, కెతోపాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెంతికూరలో ఫోలేట్, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. తోటకూరలోని ఐరన్, ఫోలేట్, కాల్షియం, విటమిన్ సి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బచ్చలికూరలోని ఫోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ,సి రిచ్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
డ్రై ఫ్రూట్స్
బాదం, వాల్ నట్స్, ఖర్జూరాలు సహా పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గర్భిణులు వీటిని తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపులో బిడ్డ ఎదుగులకు, ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు ఇవి సహాయపడతాయి.
విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్
విటమిన్ ఎ చలికాలంలో వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది పుష్కలంగా ఉండే చిలగడ దుంపలను గర్భిణులు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అట్లనే విటమిన్ సి కలిగి ఉండే ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తీసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






