- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోన్ జీరో ఫిట్‌నెస్.. వ్యాయామాల్లో కొత్త ట్రెండ్! బెనిఫిట్స్ ఇవే..
హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కోసం ఏం చేయాలోనని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ.. ‘జోన్ జీరో ట్రెండ్’ ఫాలో అయిపోండి. దీని కోసం మీరు గ్రౌండ్‌కో, జిమ్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు.

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో మీకు వ్యాయామం చేసే సమయం ఉండటం లేదా? హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కోసం ఏం చేయాలోనని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ.. ‘జోన్ జీరో ట్రెండ్’ ఫాలో అయిపోండి. ప్రస్తుతం చాలామంది దీనిని అనుసరిస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ తరహా వ్యాయామం కోసం మీరు గ్రౌండ్‌కో, జిమ్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. వందల మీటర్లు పరుగెత్తాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నిలబడటం, స్ట్రెచింగ్ చేయడం, సాధారణ కదలికల ద్వారానే అవసరమైన వ్యాయామం పూర్తి చేయడం ఇందులో భాగం. అంటే ఇది సాధారణ వ్యాయామంలా కాకుండా తక్కువ ఇంటెన్సిటీ యాక్టివిటీస్‌పై ఆధారపడుతుంది. ఇది గరిష్ట హార్ట్ రేట్‌లో 50% లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే శారీరక కదలికలకు దోహదం చేస్తూ, శరీరానికి చెమటలు పట్టకుండానే ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని నిపుణులు అంటున్నారు.
కదలికలే ప్రధానం!
జోన్ జీరో వ్యాయామం అంటే వాకింగ్ కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండే జోన్ అని చెప్పవచ్చు. ఇది రోజువారీ సాధారణ కదలికలను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ శ్రమ పడకుండా, ఇంటెన్స్ ఫీలింగ్ లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజువారీ రొటీన్‌లో భాగంగా సులభంగా చేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు సాధారణ నడక లేదా స్ట్రోలింగ్(Light walking or strolling), వాకిట్లోనే వాకింగ్ చేయడం, షాపింగ్‌కి నడుచుకుంటూ వెళ్లిరావడం, బట్టలు ఉతకడం, ఇండ్లు సర్దడం, తుడవడం, చెట్లకు నీళ్లు పట్టడం, స్ట్రెచింగ్, లాండ్రీ చేస్తున్నప్పుడు స్క్వాట్స్ వంటి లైట్ యాక్టివిటీలన్నీ జోన్ జీరో కిందికే వస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. వృద్ధులు, కండరాల బలహీనత కలిగినవారు కూడా జోన్ జీరో వ్యాయామాలు చేయడం చాలా సులభం.
ప్రయోజనాలు
జోన్ జీరో ట్రెండ్ ఫాలో అవడంవల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వ్యాయామాలు బ్లడ్ షుగర్‌ను రెగ్యులేట్ చేసి, భోజనం తర్వాత గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గించడం ద్వారా ఇన్సులిన్ సమస్యలకు చెక్ పెడతాయి. టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.లాన్సెట్ రివ్యూ వంటి రీసెర్చ్ స్టడీలు సైతం జోన్ జీరో పరిధిలోకి వచ్చే రోజువారీ సాధారణ నడక కూడా ఎర్లీ డెత్ రిస్క్‌ను తగ్గిస్తుంది. వృద్ధులు, కండరాల బలహీనత కలిగినవారు కూడా ఈ వ్యాయామాలు చేయడం సులభం.






