పాత ఆలోచనలకు పాతర.. యువతలో మారుతున్న లవ్ అండ్ డేటింగ్ థాట్స్..!

by Javid Pasha |

పాత ఆలోచనలకు పాతర.. యువతలో మారుతున్న లవ్ అండ్ డేటింగ్ థాట్స్..!

పాత ఆలోచనలకు పాతర.. యువతలో మారుతున్న లవ్ అండ్ డేటింగ్ థాట్స్..!
X

దిశ, ఫీచర్స్ : ‘‘ఒక అమ్మాయికి అబ్బాయి ఎలా ఉంటే నచ్చుతాడు? అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు?’’ ఈ ప్రశ్నకు లెక్కలేనన్ని సమాధానాలు చెబుతారు చాలా మంది. ప్రభాస్‌లా హైట్ ఉండే అబ్బాయిలంటే, అమ్మాయిలు ఇష్టపడతారని కొందరంటే.. అల్లు అర్జున్ లా పొట్టి బాయ్స్ అంటేనే మస్తు ఇష్టమని మరికొందరు అంటుంటారు. ఇక అమ్మాయిలైనా, అబ్బాయిలైనా డబ్బు, అందం, హోదా, ఆకర్షణ వంటి వాటికి ఈజీగా పడిపోతారని కూడా కొందరు విశ్లేషిస్తుంటారు. ఇక మరికొందరైతే ‘సంప్రదాయం, పద్ధతులు’ చూసి పడిపోతారని కూడా అంటుంటారు. కానీ తొక్క తోట కూర ఇవేవీ కరెక్ట్ కాదంటున్నాయి రీసెంట్ సర్వేలు. ఆ వివరాలేంటో చూద్దాం.

మారుతున్న కాలంతోపాటు లవ్, డేటింగ్ వంటి విషయాల్లో స్థిరపడిన ఆలోచనలకు, సంప్రదాయ భావాలకు ఇప్పుడు కాలం చెల్లిందని కొన్ని డేటింగ్ యాప్ తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. సర్వేలో భాగంగా ఒక డేటింగ్ యాప్ ఇటీవల ఇండియాలోని టైర్ 1, 2, 3 నగరాల్లోని 22 నుంచి 35 ఏండ్ల మధ్య వయసుగల 7, 600 మందికిపైగా యువతీ యువకులపై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా ఎదుటి వ్యక్తిని ఇష్టపడటానికి పూర్తిగా తన వ్యక్తిగత ఆలోచనలను, ఆసక్తులను, అవగాహనను, తామున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయం తీసుకుంటారు తప్ప, కవిత్వాల్లో వల్లించినట్లో, సినిమాల్లో చూపించినట్లో, తమకు సెట్ అవ్వదని భావించిననప్పటికీ కట్టుబాట్లు, సంప్రదాయలకు కట్టబడో నేటి యువత భాగస్వామిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని సర్వే పేర్కొన్నది.

అబ్బాయిలు ఫలానా టైప్ అమ్మాయిలను ఇష్టపడతారని, అమ్మాయిలు కూడా ఫలానా రకమైన అబ్బాయిలను ఎక్కువ ఇష్టపడతారనే కొన్ని ఆలోచనలు సాధారణంగా ప్రచారంలో ఉన్నాయి. సినిమా డైలాగుల్లో, సోషల్ మీడియాలో కూడా ఇవి చక్కర్లు కొడుతుంటాయి. కానీ అవి పూర్తిగా అవాస్తవాలని, స్థిరీకరించిన పాత ఆలోచనలని తాజా సర్వే పేర్కొన్నది. నేటి యువత లవ్, డేటింగ్, మ్యారేజ్ వంటి విషయాల్లో డబ్బు, అందం, హోదా, ఆకారం వంటి విషయాల్లో కచ్చితంగా ఇలాగే ఉండాలనే ఫిక్స్‌డ్ మైండ్‌తో ఉండటం లేదని కూడా తెలిపింది.

‘అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. హైట్ ఎక్కువుంటే ప్రేమిస్తారు. అబ్బాయిలు పొట్టి అమ్మాయిలనే ఎక్కువ లైక్ చేస్తారు’ అనేవి ప్రచారంలో ఉన్న అపోహలు మాత్రమేనని సర్వే పేర్కొన్నది. యువతీ యువకులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇష్టపడటంలో, లవ్ అండ్ డేటింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో పూర్తిగా వ్యక్తిగత అవగాహన, ఆసక్తి, కుటుంబ, సామాజిక పరిస్థితులను మాత్రమే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు సంబంధాల్లో ఎమోషనల్ డెప్త్‌కు చాలా మంది ప్రయారిటీ ఇస్తున్నట్లు చెబుతున్నాయి. అంతేకానీ ప్రచారంలో ఉన్న మూసధోరణలు, పాత ఆలోచనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నాయి.

Next Story