మద్యం ఇలా సేవిస్తే.. బ్లడ్ షుగర్ పక్కా

by Dishanational2 |
మద్యం ఇలా సేవిస్తే.. బ్లడ్ షుగర్ పక్కా
X

దిశ, ఫీచర్స్ : బ్లడ్ షుగర్ గురించి చాలాసార్లు వినే ఉంటారు. రక్తంలో చక్కెర(గ్లూకోజ్) పరిమాణం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు అది సమస్యగా మారుతుంది. టైప్ 1 డయాబెటిస్ వ్యక్తుల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గినపుడు అలసట, ఒత్తిడి, ఆందోళనతో పాటు క్రమరహిత హృదయ స్పందనను అనుభవించవచ్చు. టైప్ 2 డయాబెటిస్ వ్యక్తుల్లో గ్లూకోజ్ పరిమాణం పెరగడం వల్ల విపరీతమైన దాహం, తరుచూ మూత్ర విసర్జన సమస్యలు ఎదుర్కొంటారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే తీవ్ర అనారోగ్యానికి దారితీయొచ్చు. అయితే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటనెన్స్‌కు ఫుడ్, డ్రింక్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి కాగా.. కొన్ని చెత్త డ్రింకింగ్ హ్యాబిట్స్‌‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అతిగా మద్యపానం..

మితంగా మద్యం సేవించడం ఏమంత ప్రమాదకరం కాదు. కానీ హైపోగ్లైసీమియా(రక్తంలో తక్కువ గ్లూకోజ్ లెవెల్స్) ఉన్నవారు నియంత్రణ పాటించాల్సిందే. ఎందుకంటే అనేక డయాబెటిస్ మెడిసిన్స్ ఆల్కహాల్‌తో కలిసిపోయి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ హెచ్చరించింది. దీనివల్ల అతిగా తినడం, నిద్రాభంగం, నిర్జలీకరణతో పాటు బాడీలో ఇతర ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయన్నారు. అందుకే తాగడానికి ముందే తగినంత తినాలని, ఎంత తాగాలో ముందే డిసైడ్ చేసుకుని అదే ప్రణాళికను అనుసరించాలని చెప్తున్నారు.

సరిపడా నీళ్లు తాగకపోవడం..

రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు డీహైడ్రేషన్ కూడా ఒకటని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెబుతోంది. ఆర్ద్రీకరణ అనేది రక్తాన్ని పలుచగా చేయడంలో సాయపడటంతో పాటు చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని గో వెల్‌నెస్‌ రచయిత కోర్ట్నీ డి ఏంజెలో చెప్పారు. ఒకవేళ పుష్కలంగా నీరు తాగడం కష్టమైతే అధిక చక్కెర లేదా కెఫిన్ కంటెంట్ ఉన్న పానీయం తాగిన తర్వాత 8-ఔన్సుల గ్లాసు నీటిని తాగాలని సూచించారు.

మితిమీరిన షుగర్ డ్రింక్స్..

బ్లడ్ షుగర్ విషయంలో చక్కెర-తీపి పానీయాలు అన్ని విధాలా హానికరం. రోజుకు కనీసం ఒకటి లేదా రెండు గ్లాసుల సోడా తీసుకునే వ్యక్తుల్లో టైప్ 2 డయాబెటిస్‌ డెవలప్ అయ్యే అవకాశం 26% ఎక్కువగా ఉంటుంది. సోడాలతో పాటు టీ, జ్యూస్‌, స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా కొన్ని ప్రత్యేక రుచులు గల కాఫీల్లో ఉండే షుగర్ కంటెంట్‌ చాలా త్వరగా రక్తప్రవాహంలోకి శోషించబడి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

ఖాళీ కడుపుతో ఆల్కహాల్..

ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ను సేవించడం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఎటువంటి ఆహారం లేకుండా కేవలం జీర్ణాశయంలోని ఆల్కహాల్‌‌ను మాత్రమే గ్రహించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పడిపోతాయి. అంతేకాకుండా మరసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్‌ సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. అందుకే బ్లడ్ షుగర్‌ను స్థిరీకరించాలంటే పార్టీకి గంట ముందే ప్రొటీన్-రిచ్ ఫుడ్ లేదా అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చీజ్ లేదా క్రాకర్స్, పండ్లతో గట్టిగా ఉడికించిన గుడ్లు లేదా టర్కీ లేదా పీనట్ బటర్ శాండ్‌విచ్ బెటర్ ఆప్షన్‌గా వివరించారు.

లెక్కకు మించిన కెఫిన్ డ్రింక్స్..

ఎనర్జీ డ్రింక్స్ లేదా కెఫిన్ కంటెంట్ గల డ్రింక్స్ బాడీకి కావలసిన ఎనర్జీని ఇస్తాయి. కానీ ఇందులో చక్కెర, కెఫిన్, ఇతర సంకలితాల మిశ్రమంగా ఉంటుంది. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల హృదయ స్పందనలో ఆటంకాలు, నిద్రకు భంగం కలగవచ్చు. హృదయ స్పందన రేటుతో పాటు రక్తపోటు పెరుగుతుంది. అనారోగ్యకరమైన షుగర్ కంటెంట్ కలిగి ఉండే ఇలాంటి పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాక తాగిన తర్వాత మీ శరీరం మరింత కోరుకునేలా చేస్తుంది.


Next Story

Most Viewed