Viral: వావ్.. విమానంలా గాల్లో ఎగిరే బైక్‌ కూడా వచ్చేసిందిగా..!

by Javid Pasha |

Viral: వావ్.. విమానంలా గాల్లో ఎగిరే బైక్‌ కూడా వచ్చేసిందిగా..!

Viral: వావ్.. విమానంలా గాల్లో ఎగిరే బైక్‌ కూడా వచ్చేసిందిగా..!
X

దిశ, ఫీచర్స్ : పక్షులు ఎగురుతాయ్.. విమానాలు ఎగురుతాయ్.. పారాచుట్స్ ఎగురుతాయ్.. ఆ మధ్య ఎగిరే ట్యాక్సీ గురించి కూడా విన్నాం. కానీ ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు ఔత్సాహికుల్లో ఆశలు రేకెత్తించారు. ఏంటంటే.. ఇప్పటి వరకు నేలపై నడిచే బైకులనే మనం చూశాం. కానీ రీసెంట్‌గా వోలోనాట్ అండ్ జెట్సన్ ఏరోలు కలిసి (developed by Volonaut in association with Jetson Aero) గాల్లో ఎగిరే బైకును తయారు చేశారు.

అవును.. వోలోనాట్ అండ్ జెట్సన్ ఏరో టెక్నికలల్ నిపుణులు కలిసి ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు. వీరు ఎగిరే బైకును తయారు చేశారు. జెట్సన్ ఏరో కో ఫౌండర్ టోమాస్జ్ పాటన్ దీని డెవలప్ మెంట్‌లో కీ రోల్ పోషించాడు. ‘ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL)’ వెహికల్‌గా పేర్కొంటున్న ఈ బైక్ పర్సనల్ స్పేస్‌ ఫ్లైట్ టెక్నాలజీ(personal spaceflight technology)లో ఒక అద్భుత ఆవిష్కరణగా నిపుణులు పేర్కొంటున్నారు.

జెట్ ఇంజిన్లతో నడిచే ఈ సరికొత్త వోలోనాట్ (Volonat Airbike) ఎయిర్ బైక్ ఇప్పటికిప్పుడు అందుబాటులోకి రాకపోవచ్చు. ఎందుకంటే ప్రారంభ దశలో ఉంది. కేవలం 20 నిమిషాలపాటు మాత్రమే ఎగిరే సామర్థ్యం కలిగి ఉండటంతోపాటు జెట్సన్ అధిక ధర(On par with the Jetson ONE's $92,000), నియంత్రణ సవాళ్లు (regulatory challenges) వంటి అడ్డంకులవల్ల రోజువారీ వినియోగం కోసం అందుబాటులోకి తేవడం ప్రస్తుతమైతే సాధ్యం కాదు. కానీ, భవిష్యత్‌లో అది జరుగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇప్పటికే దీని తయారీ, పనితీరు కూడా విజయవంతంగా పూర్తయిందని జెట్సన్ ఏరోకు చెందిన నిపుణులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

Next Story