Viral video : వావ్.. ఈ వెరైటీ బైక్ చూశారా..? ఏ దిశలోనైనా ఈజీగా వెళ్లొచ్చు!

by Javid Pasha |   ( Updated:2025-04-15 12:48:48.0  )
Viral video : వావ్.. ఈ వెరైటీ బైక్ చూశారా..? ఏ దిశలోనైనా ఈజీగా వెళ్లొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : బైక్ అంటే టూ వీల్స్ ఉంటాయనే విషయం తెలిసిందే.. కానీ రెండు పెద్ద పెద్ద బాల్స్‌తో నడిచే బైకును మీరు చూశారా? అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెంచుతోంది. వావ్ ఇలాంటివి కూడా ఉంటాయా? అనేలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా ఈ వెరైటీ (Incredible) ఎలక్ట్రికల్ బాల్ బైకును జేమ్స్ బ్రూటన్ అనే బ్రిటన్ యూట్యూబర్, ఆవిష్కర్త, రోబోటిక్స్ ఔత్సాహికుడు రూపొందించాడు.

రెడ్ కలర్‌లో ఉన్న జేమ్స్ బ్రూటన్ రూపొందించిన ఓమ్ని - డైరెక్షనల్ (Omni - directional) బాల్ - వీల్డ్ బైక్ (Ball - wheeled bike) ఎందుకంత క్రేజీ.. అంటే ఇది సాధారణ బైక్ వీల్స్‌కు బదులుగా రెండు పెద్ద పెద్ద రెడ్ కలర్ బంతులను చక్రాలుగా కలిగి ఉంది. దీంతో ఈ బైకు మీద కూర్చొని ఏ దిశలోనైనా ఈజీగా కదలొచ్చు. ఇందులో 5 మోటార్లు, 3డి ప్రింటెడ్ భాగాలతోపాటు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ (Self-balancing) సిస్టమ్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఆవిష్కరణ పరిశీలన దశలోనే ఉంది. రోడ్డుపై వాడేందుకు రెడీగా లేదు. భవిష్యత్తులో ఏ దిశలోనైనా కదలుతూ వెళ్లగలిగే సరికొత్త బైకుల తయారీ ఆలోచనలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని, కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఇస్తుందని దాని తయారీ దారు జేమ్స్ బ్రూటన్ పేర్కొంటున్నాడు.



Next Story

Most Viewed