చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదా

by Disha Web Desk 15 |
చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదా
X

దిశ, వెబ్​డెస్క్​ : మన పూర్వికులు ఆచారాలు, సంప్రదాయాలు కేవలం అవసరాలకు మాత్రమే సృష్టించలేదు. వాటిలో కొంత శాస్త్రీయత దాగి ఉంటే మరికొంత కట్టుబాట్లు దాటకూడదనే ఉద్దేశం దాగి ఉంది. అయితే చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు బతికున్న వారు ఉపయోగించుకోవచ్చా అంటే మత గురువులు కూడదనే చెబుతున్నారు. అలా వాడితే కొన్ని ఇబ్బందులు మనల్ని చుట్టుముడతాయి. అవి మన జీవిత ప్రశాంతతను పాడు చేస్తాయి. కాబట్టి చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువులు ఏవి వాడకూడదో తెలుసుకుందాం.

నగలు వాడొద్దు

మృతదేహానికి సంబంధించిన నగలను ఉపయోగించవద్దు. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు తమ మరణానంతరం నగలను తమ పిల్లలకు అందజేయాలని ఆశపడుతుంటారు. కానీ వాటిని నేరుగా అలాగే వాడకూడదు. వాటిని అమ్మి మరో బంగారు నగలు తీసుకోవచ్చు. లేదా వాటిని కరిగించి కొత్తవి చేయించుకోవచ్చు.

దుస్తులు

చనిపోయిన వ్యక్తుల దుస్తులను ధరించొద్దు. ఇంట్లో కూడా ఉంచొద్దు. ఆ వస్త్రాన్ని దానం చేయడం మంచిది. లేదా వాటిని బయటపడేస్తే మంచిది. ఎందుకంటే వారు జీవించి ఉన్నప్పుడు వారికి నచ్చిన బట్టలపై కోరికలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా దాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారని చెబుతారు.

గడియారం

చనిపోయిన వ్యక్తి ధరించిన వాచ్ వాడకూడదు. ఎందుకంటే అది మీపై నిరుత్సాహపరిచే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చనిపోయిన వ్యక్తి గురించి మీకు తరచుగా కలలు కూడా వస్తాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.

Read More: చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడుతారా? దాని వెనుక రహస్యం ఇదే!

Next Story