- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Svalbard Island : 5 నెలలకోసారి మాత్రమే సూర్యుడు ఉదయించే అందమైన ప్రాంతం.. ఎక్కడుందో తెలుసా?
Svalbard Island : 5 నెలలకోసారి మాత్రమే సూర్యుడు ఉదయించే అందమైన ప్రాంతం.. ఎక్కడుందో తెలుసా?

దిశ, ఫీచర్స్ : ఈ భూమిపై ఎక్కడైనా సరే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనే ప్రక్రియ ప్రతిరోజూ జరుగుతుంది. కానీ ఒకచోట మాత్రం అలా కాదు. అక్కడ ప్రతీ 5 నెలలకు ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. అది కూడా ఉదయంపూట కాదు, అర్ధరాత్రిపూట ఉదయిస్తాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? 5 నెలలకు ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయించడం వెనుకగల కారణాలేమిటో చూద్దాం.
అది నార్వేలోని ఆర్కిట్ మహాసముద్రంలో గల స్వాల్బార్డ్ ద్వీపం (Svalbard Island). చూడ్డానికి అందంగా ఎంతో అందంగా ఉండే ఈ ద్వీపంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ ప్రతిరోజూ సూర్యుడు ఉదయించడు. ప్రతీ 5 నెలకు ఒకసారి మాత్రమే ఉదయిస్తాడు. అంటే శాస్త్రవేత్తల ప్రకారం ఈ ద్వీపంలో 5 నెలలపాటు పగలు మరో 5 నెలల పాటు రాత్రి (అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు) ఉంటుంది. ఎందుకలా జరుగుతుందంటే భూమిపై గల చివరి దేశం లేదా ద్వీపం ఇదే కాబట్టి, పైగా అది తన అక్షం మీద తిరిగే ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడి భౌగోళిక, పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా 5 నెలలు పగలు, 5 నెలలపాటు రాత్రి ఉంటుంది. రాత్రి సమయం ఉన్నంతకాలం సూర్యుడు హోరిజోన్ కింద అదృశ్య రూపంగా ఉంటాడు. దీనినే పోలార్ నైట్ అంటారు.
స్వాల్బార్డ్ ద్వీపంలో 5 నెలలపాటు రాత్రి సమయం ఉండటాన్ని శాస్త్రవేత్తలు, అక్కడికి వెళ్లి వచ్చిన ప్రజలు మనోహరమైన రాత్రుళ్లుగా అభివర్ణిస్తారు. ఎందుకంటే సూర్యుడు ఆకాశం దిగువన దాగి ఉండటం కారణంగా ఇది దట్టమైన చీటకిగా కూడా ఉండదు. మిగతా దేశాల్లో తెల్లవారు జాము సమయం ఎలా ఉంటుందో స్వాల్బార్డ్ ద్వీపంలో రాత్రి వేళ వాతావరణం అలా ఉంటుంది. పైగా ఆకాశం నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ద్వీపంలో మెరుస్తున్న మంచు దిబ్బలపై ఆకాశపు రంగు ప్రతిబింబించడంవల్ల ఆ ప్రాంతమంతా ఊదా లేదా నీలిరంగులో ప్రశాంతమైన చల్లని వాతావరణంతో ఆకట్టుకుంటుంది.






