- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Population : ఎక్కువ మంది పిల్లల్ని కనండి ప్లీజ్..!! లేకుంటే జరిగేది ఇదే..
Population : ఎక్కువ మంది పిల్లల్ని కనండి ప్లీజ్..!! లేకుంటే జరిగేది ఇదే..

దిశ, ఫీచర్స్ : జనాభా పెరిగిపోతే అభివృద్ధికి ఆటంకంగా మారుతుందనే రోజులు పోయి.. జనాభాను పెంచి ప్రపంచ అభివృద్ధికి పాటుపడండి అనే రోజులు వచ్చేశాయిప్పుడు. పిల్లలు వద్దంటూ నివేదికలు రూపొందించిన సంస్థలే.. పిల్లల్ని కనండి ప్లీజ్ అంటూ రిపోర్టులు వెలువరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలే సంతాన ప్రదాతలంటూ తెగ పొగిడేస్తున్నాయి. స్త్రీలు దయతల్చకుంటే మానవాళి అంతరించిపోయే రోజులు ఎంతోదూరం లేవని చెబుతున్నాయి. తాజాగా (Public Library of Science (PLOS) అధ్యయనం కూడా అదే పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం
ఒకప్పటితో పోలిస్తే ప్రపంచ జనాభా క్షీణిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది. ముఖ్యంగా అమెరికా 1.7, దక్షిణ కొరియా 0.78, జపాన్ 1.26, చైనా 1.09, అలాగే యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్ వంటివి TFR 1.3 కంటే తక్కువ జనాభా తగ్గుదలను రేటును ఎదుర్కొంటున్నాయి. ఈ లెక్కలు వాస్తవానికి ఆర్థిక ఒత్తిడి, వృద్ధాప్య జనాభా, కార్మికుల కొరతను కూడా సూచిస్తాయి. ఈ దేశాల్లో కాస్త ఎక్కువ పడిపోయిందేమో కానీ.. మిగతా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సంతానోత్పత్తి రేటు ఉండటం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే కంటిన్యూ అయితే ప్రపంచ మానవాళి అంతరించిపోయే రోజులు వస్తాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
PLOS One స్టడీ ప్రకారం.. మానవాళి క్రమంగా అంతరించకుండా నిరోధించాలంటే సంతానోత్పత్తి రేటును పెంచాలి. అందుకోసం సగటు మహిళ 2.7 మంది పిల్లలను కనాల్సి ఉంటుందని, ఇది దీర్ఘకాలంగా భావించిన 2.1 రీప్లేస్‌మెంట్ రేటు కంటే చాలా ఎక్కువని నివేదికలు పేర్కొంటున్నాయి. మరణాల రేటు, లింగ అసమతుల్యత(Gender imbalance), అట్లనే కొత్త తరం ఎక్కువమంది పిల్లలను కనకపోవడం లేదా ఒక్కరో ఇద్దరినే కనడం వంటి వాస్తవ-ప్రపంచ సవాళ్ల(Real-world challenges)ను ఈ సంఖ్య కళ్లకు కడుతోంది.
అయితే సంతానోత్పత్తి రేటు(Fertility rate)ను బాధ్యతాయుతంగా పెంచడానికి, చైల్డ్‌కేర్, కుటుంబ సెలవు(family vacation), ఆర్థిక స్థిరత్వానికి విధానపరమైన చర్యలు అవసరమని నిపుణులు నొక్కిచెబుతున్నారు. లేకపోతే అధ్యయనాల డేటా ఎలా ఉన్నప్పటికీ, కుటుంబాలను అంటే జనాభాను పెంచడానికి తగిన భద్రత లేదని చాలామంది భావిస్తారు.
ఉదాహరణకు, స్వీడన్ వంటి దేశాలు బలమైన కుటుంబ విధానాలతో సుమారు 1.8 సంతానోత్పత్తి రేటును నిర్వహిస్తున్నాయి. దీనిని బట్టి సమస్య పరిష్కారానికి ఆచరణీయ మార్గాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాలు కూడా జనాభా పెరుగుదలకు తగిన చర్యలు తీసుకుంటే ప్రపంచ మానవాళి అంతరించిపోయే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా టోటల్ ఫెర్టిలిటీరేట్(TFR) 2.7 సాధించే లక్ష్యంతో పనిచేయడమే ప్రపంచ జనాభా స్థిరత్వానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.






