- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Red meat : డిమెన్షియా రిస్క్‌ను తగ్గిస్తున్న కొవ్వు పదార్థాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దంటున్న నిపుణులు !
Red meat : డిమెన్షియా రిస్క్‌ను తగ్గిస్తున్న కొవ్వు పదార్థాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దంటున్న నిపుణులు !

దిశ, ఫీచర్స్ : కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం తెలిసిందే. అయితే ఇందులోనూ మంచీ, చెడూ అని రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అయితే ఆహారంలో మంచి కొవ్వు(Good fat)ను మాత్రం తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. న్యూట్రిషన్ జర్నల్‌లో పబ్లిషైన రీసెంట్ అధ్యయనం కూడా అదే పేర్కొన్నది. ముఖ్యంగా వెన్న, రెడ్‌మీట్, గుడ్లు వంటి సహజ సంతృప్త కొవ్వులు(natural saturated fats) కలిగిన ఆహారాలను తీసుకోవడంవల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, డిమెన్షియా వచ్చే రిస్క్ 18 % తగ్గుతుందని వెల్లడించింది.
అధ్యయనంలో భాగంగా పలువురి ఆహారపు అలవాట్లను విశ్లేషించిన పరిశోధకులు సహజ సంతృప్త కొవ్వులు(natural saturated fats)మెదడు కణాల నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని గుర్తించారు. ముఖ్యంగా వెన్న, రెడ్ మీట్, గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ ఈ విధమైన ఫలితాన్ని కలిగిస్తున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా వీటిలోని గుడ్ అండ్ నేచురల్ సాచురేటెడ్ కొలెస్ట్రాల్ మెదడు సామర్థ్యాన్ని(cognitive function), జ్ఞాపక శక్తిని పెంచుతుందని, దీంతో డిమెన్షియా రిస్క్‌ను 18 % తగ్గిస్తుందని కూడా పరిశోధకులు నిర్ధారించారు.
శరీరానికి అవసరమైన కీలక హార్మోన్ల ఉత్పత్తిలోనూ గుడ్లు, వెన్న, రెడ్ మీట్ తినడం ద్వారా లభించే సంతృప్త కొవ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా జంతు ఆధారిత ఆహారం ద్వారా లభించే కొవ్వులు కూడా బ్రెయిన్ హెల్త్ విషయంలో ఊహించని ప్రయోజనాలు అందిస్తున్నట్లు అధ్యయనాన్ని విశ్లేషించిన పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి వెన్న(butter), గుడ్లు, ఎర్రమాంసం(Red meat) వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రాసెస్ చేసిన లేదా కృత్రిమ కొవ్వు(Artificial fats)ల అధిక వినియోగం మాత్రం మంచిది కాదని, ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.






