- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ఫ్రీ డైనింగ్.. రెస్టారెంట్లలో విస్తరిస్తున్న కొత్త ట్రెండ్!
ఎప్పుడూ ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ కూర్చోవడంవల్ల భోజన సమయంలో రుచిని, ఆనందాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో0 పలు రెస్టారెంట్లు ‘ఫోన్ ఫ్రీ డైనింగ్’ మూమెంట్‌ను ప్రారంభించాయి.

దిశ, ఫీచర్స్ : ఆఫీసుల్లోనో, ఆస్పత్రుల్లోనో ఫోన్ల వాడకాన్ని తగ్గించాలనడం కొన్నిసార్లు సాధారణమే. కానీ రెస్టారెంట్లు, బార్లల్లో కూడా ఈ నిబంధనను అమలు చేస్తే.. జనాలు వాటిని ఫాలో అయితే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇటీవల ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. అనేక దేశాల్లోని రెస్టారెంట్లు, బార్లు ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా భోజన సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాతావరణాన్ని పెంపొందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ‘నో-స్క్రోల్/నో ఫోన్ మూమెంట్’ అమెరికాలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
అసలు ఉద్దేశం ఇదే..
ఎప్పుడూ ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ కూర్చోవడంవల్ల భోజన సమయంలో రుచిని, ఆనందాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. అలాగే మనుషుల మధ్య సంభాషణలు, సంబంధాలు కూడా తగ్గుతున్నాయని రెస్టారెంట్ యజమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నో-స్క్రోల్ లేదా ఫోన్ ఉద్యమాన్ని స్వయంగా ముందుకు తెచ్చి అమలు చేయడం ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. విదేశాల మాదిరి ఇండియాలో పూర్తిస్థాయిలో ఇది వ్యాపించలేదు. కానీ హై-ఎండ్ రెస్టారెంట్లు, సూపర్ క్లబ్‌లు , ఫైన్ డైనింగ్ ప్లేస్‌లలో ఇప్పుడిప్పుడే ‘నో ఫోన్’ మూమెంట్ ప్రారంభమైంది. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, ఫొటోలు తీయకూడదని కస్టమర్లను కోరుతున్నాయి. డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం, సంభాషణలు పెంచడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని లిస్టెనింగ్ బార్లు, సప్పర్ క్లబ్‌లు, అప్‌స్కేల్ రెస్టారెంట్లు కూడా ఇటీవల ‘ఫోన్-ఫ్రీ డైనింగ్’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి.
ఏం చేస్తారు?
ఫోన్ ఫ్రీ డైనింగ్ లేదా నో స్క్రోల్ ట్రెండ్ ఫాలో అవుతున్న రెస్టారెంట్లు కస్టమర్లు వచ్చినప్పుడు ఫోన్లను టేబుల్ మీద ఉంచకూడదని, కాల్స్ లేదా స్క్రోలింగ్ నిషేధమని ముందుగానే చెప్పేస్తున్నాయి. నోటీసు బోర్డుల్లోనూ పెడుతున్నాయి. కొన్ని హై-టెక్ లాక్ పౌచెస్ (Yondr Pouches)లో ఫోన్లను లాక్ చేసి, భోజనం పూర్తి అయ్యే వరకు ఇవ్వవు. ఉదాహరణకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన చార్లెట్‌లోని Antagonist కాక్‌టైల్ బార్ వినియోగదారుల ఫోన్లను రెండు గంటలపాటు లాక్ చేస్తుంది. అలాగే అప్‌స్కేల్ సూపర్ క్లబ్ Delilah గౌరవప్రదమైన స్థలాల్లో “నో ఫోన్స్, నో పోస్టింగ్” పాలసీ అమలు చేస్తోంది.
పెరుగుతున్న ఆదరణ
ఫోన్-ఫ్రీ డైనింగ్’ మూమెంట్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ట్రెండ్ కేవలం అమెరికాలోనే కాకుండా ఆ దేశంలోని 11 రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోనూ వ్యాపించింది. జెన్‌జీలు సైతం భోజన సమయంలో ఫోన్ వాడకూడదనే ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సంభాషణలు పెరుగుతాయని, ఆహారం రుచిగా అనిపిస్తుందని, ప్రైవసీ మెరుగుపడుతుందని రెస్టారెంట్ యజమానులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి రెస్టారెంట్లలో స్నేహపూర్వక, ఆకర్షణీయమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఈ కొత్త ట్రెండ్ కీ రోల్ పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.






