- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral : ధనిక మహిళలతో అలా గడపడమే తన జాబ్ అంటున్న జపనీస్ వ్యక్తి.. నెలకు లక్షల్లో సంపాదన!!
Viral : ధనిక మహిళలతో అలా గడపడమే తన జాబ్ అంటున్న జపనీస్ వ్యక్తి.. నెలకు లక్షల్లో సంపాదన!!

దిశ, ఫీచర్స్ : డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏ ఉద్యోగమో, ఉపాధినో వెతుక్కోవాలి? కష్టపడి పనిచేయాలి? కానీ ఓ వ్యక్తిమాత్రం అలా కాదు. కొంతమంది ధనిక మహిళలను ఎంటర్టైన్ చేస్తూ.. అవసరమైన వారికి తోడుంటూ.. ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ అదెక్కడ? అతనెవరు? అనే కదా సందేహం. లెట్స్ గో అండ్ రీడ్ !
అతని పేరు టకుయా ఇకోమా (Takuya Ikoma). వయసు 31 ఏండ్లు. విషయం విశేషం ఏంటంటే.. జపాన్ దేశానికి చెందిన ఈ వ్యక్తి ఇప్పుడు 15 మంది వరకు ధనిక మహిళలకు వేర్వేరు సమయాల్లో ఎమోషనల్ సపోర్ట్ అందించడం కోసం సదరు మహిళల ద్వారా నియమించబడ్డాడు.అవసరమైనప్పుడు మాటల ద్వారా తనను నియమించుకున్న మహిళలను ఎంటర్టైన్ చేయడం, బాధలు, భావోద్వేగాల సమయంలో మద్దుతను అందించడం, కలిసి తినడం, కలిసి తాగడం, ఎక్కడికైనా వెళ్లినప్పుడు తోడుగా ఉండటమే టకుయా ఇకోమా పని. అయితే ఇదే తన వృత్తి అంటున్నాడు ఇకోమా. జపాన్‌లో ఇలాంటివి చాలా సహజమట. ఒంటరి స్త్రీలు తమకు ఎమోషనల్ సపోర్ట్ (Emotional support) అందించేందుకు తాత్కాలికంగా పురుషుడిని నియమించుకుంటారు.
అయితే ఒంటరి మహిళలు తమకు భావోద్వేగ మద్ధతును అందించడానికి, పార్టీలకు, పబ్బులకు, ట్రిప్‌లకు వెళ్లినప్పుడు తోడుగా ఉండేందుకు నియమించుకునే వ్యక్తిని జపాన్‌లో ‘కెప్ట్ మ్యాన్(Kept man)’ అని పిలుస్తారు. కాగా 15 మంది ధనిక ఒంటరి మహిళలకు ‘కెప్ట్ మ్యాన్’గా ఉంటున్న ఇకోమా ప్రస్తుతం జపనీస్ కరెన్సీలో నెలకు దాదాపు ఒక మిలియన్ యెన్. అంటే రూ. 6 లక్షలు సంపాదిస్తున్నాడట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది.






