Dad's love : అది కదా నాన్న ప్రేమ..! కూతురి కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..

by Javid Pasha |

Dad's love : అది కదా నాన్న ప్రేమ..! కూతురి కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..

Dads love : అది కదా నాన్న ప్రేమ..! కూతురి కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..
X

దిశ, ఫీచర్స్ : నాన్న అంటేనే ప్రతీ బిడ్డకు చెప్పలేనంత ఆనందం. నాన్న ఉంటేనే పిల్లలకు కొండంత ధైర్యం. అందుకే అంటుంటారు పెద్దలు, నాన్నంటే ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత అని. బతుకు దెరువు పోరాటంలో ఎన్ని కష్టాలొచ్చినా సరే, తన పిల్లలకోసం అన్నింటినీ ఓర్చుకొని, వారి ముఖంలో ఆనందం చూడాలనుకుంటాడు నాన్న. అచ్చం అలాంటి సన్నివేశాన్ని గుర్తు చేసే న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

అది గురుగ్రామ్‌లోని ఓ ప్రాంతం. ఓ సంస్థలో సీఈఓగా పనిచేస్తున్న మయాంక్ అగర్వాల్‌కు బాగా ఆకలి వేసి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ ఎంతవరకు వచ్చాడో తెలుసుకుందామని కాల్ చేయగా.. అవతలి నుంచి వినిపించిన వాయిస్ విని, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే.. అది చిన్న పాప వాయిస్. కిందికి వెళ్లి చూడగా బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాప టున్ టున్ కూడా ఉంది. పంకజ్ ద్వారా అసలు విషయం తెలుసుకొని మయాంక్ కళ్లు చెమ్మగిల్లాయి. గుండె ద్రవించింది. క్షణంపాటు భావోద్వేగానికి లోనయ్యాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏం జరిగిందంటే.. డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు కాగా, అతని భార్య రెండవ టున్ టున్‌ పుట్టగానే, అంటే ప్రసవ సమయంలో చనిపోయింది. దీంతో పిల్లల్ని చూసుకునేవారు కరువయ్యారు. ఇద్దరు పిల్లల్లో కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతూ.. రెండేళ్ల కూతురు టున్ టున్‌ను మాత్రం తనతోపాటు బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు పంకజ్. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ.. పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా తప్పట్లేదు అంటున్న పంకజ్ మాటలు అందరినీ కలచి వేస్తున్నాయి. అతనికి సహాయం చేయాలని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందరూ అది కదా నాన్న ప్రేమంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story