- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Swim Call : నడి సంద్రలో ఈత సరదా..‘స్విమ్ కాల్ విరామం’లో మస్తు మజా..!
Swim Call : నడి సంద్రలో ఈత సరదా..‘స్విమ్ కాల్ విరామం’లో మస్తు మజా..!

దిశ, ఫీచర్స్ : నట్టనడి సముద్రంలో, అహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా ఈత కొడితే ఎలా ఉంటుంది? షార్క్‌లు, మొసళ్లు వంటి జలచరాలతో కాస్త భయం తప్ప, అవిలేనప్పుడైతే మస్తు ఎంజాయ్ బుల్‌గా ఉంటుంది అంటారు నావికాదళంలో పనిచేసే సైనికులు. ఎందుకంటే వీరి జీవితంలో అలాంటి ఆనందాన్ని, మధురానుభూతిని కలిగించే అనుభవం తప్పక ఉటుంది. దీనినే ‘స్విమ్ కాల్’ అని పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ సహా పలు దేశాల నావికాదళాల్లో సైనికులకు ఉత్తేజకరమైన విరామాన్ని అందించే ఒక అరుదైన సంప్రదాయం.
వాస్తవానికి నావికాదళాలు, సముద్రపు నీటి భద్రత కోసం నియమించబడే ప్రత్యేక సైనిలు ఎప్పుడూ విధుల్లో బిజీగా ఉంటారు. అయితే వీరికి అప్పుడప్పుడూ రిలాక్సేషన్ అందించడానికి ఓడ సురక్షిత పరిస్థితుల్లో, బహిరంగ సముద్రం(open sea)లో స్థిరంగా ఉన్నప్పుడు ‘స్విమ్ కాల్’ విరామం ఇస్తారు. అంటే ఈ సందర్భంలో సైనికులు ఓడ నుంచి సముద్రంలోకి దూకి, విశాలమైన జలరాశిలో ఈత కొట్టే అవకాశం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం సైనికుల మధ్య స్నేహభావాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతూ, సముద్రంతో ఒక లోతైన అనుబంధాన్ని సృష్టిస్తుంది. సముద్ర జీవితంలోని రొటీన్ లైఫ్, కఠిన నియమాల మధ్య మరుపు రాని మధురానుభూతిగా నిలుస్తుంది.
స్విమ్ కాల్ సమయంలో సముద్రం శాంతంగా, జలచరాలు లేని ప్రాంతంలో ఉండేలా కఠిన భద్రతా చర్యలు తీసుకుంటారు. షార్క్‌లు, జెల్లీఫిష్ వంటి ప్రమాదకర జీవులను గుర్తించడానికి ఇతర నావికులు గస్తీ తిరుగుతారు. రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచుతారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సైనికులు ఓడ డెక్ నుంచి సముద్రంలోకి దూకుతూ, కేరింతలతో కొడుతూ సందడి చేస్తారు. ఇలా నడి సంద్రంలో సరదాగా ఈతకొట్టే ఆ క్షణాలు స్వేచ్ఛ, సాహసం, ఆనందం, మధురానుభూతిని అనుభవించే అవకాశం కల్పిస్తాయి. ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి జట్టుగా బంధాన్ని బలపరుస్తాయి.
మెడిటరేనియన్ సముద్రం, హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రం, పర్షియన్ గల్ఫ్, లేదా కరీబియన్ సముద్రం వంటి అనువైన వాతావరణం కలిగిన లోతైన జలాలలో ఈ ‘స్విమ్ కాల్’ కార్యక్రమాలు జరుగుతుంటాయి. యునైటెడ్ స్టేట్స్ నావీలో ఈ సంప్రదాయం ‘స్విమ్ కాల్’ గా పిలవబడుతుండగా, బ్రిటిష్ రాయల్ నావీలో, రాయల్ ఆస్ట్రేలియన్ నావీలో దీనిని ‘హ్యాండ్స్ టు బాత్’ అని పిలుస్తారు. Link






