- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Expensive water: వామ్మో.. డైమండ్‌ను మించిన రేంజ్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్లు.. 750ml కు 50లక్షలు చెల్లించాలట

దిశ, వెబ్ డెస్క్: Expensive water: ప్రతిజీవికి ప్రాణవాయువు తర్వాత అత్యంత ప్రామాణికమైంది నీరు. మనిషి శరీరంలో సుమారు 60 నుంచి 70శాతం వరకు నీరు ఉంటుంది. ఆహారం లేకున్నా కొన్ని రోజులు జీవించగలమేమో కానీ..నీరు లేకుండా ఉండలేము. ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారింది. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం మన దౌర్భగ్యామే అని చెప్పవచ్చు. ఈమధ్య ఓ హీరో ఓ వాటర్ బాటిల్ తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ నీరు బాటిల్ ధర 130 నుంచి 160 రూపాయలు. అంటే ఆ బ్రాండ్ ఒక లీటర్ నీరు సుమారు రూ. 550 ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోయే వార్త కూడా అలాంటిదే. అవును ప్రపంచంలో అత్యధిక ఖరీదైన వాటర్ బ్రాండ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. లక్షల్లో ధర పలికే ఆ వాటర్ బ్రాండ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు కూడా ఉందా? ఇది విన్న తర్వాత మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర బాటిల్ ధర ఎంత ఎక్కువగా ఉందంటే..దానికి ధరకు విలాసవంతమైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేయవచ్చు.
అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్ వాటర్. ఈ నీరు ఫిజీ, ఫ్రాన్స్‌లోని సహజ నీటి బుగ్గ నుండి వస్తుంది. ఈ బాటిల్ ప్యాకేజింగ్ ఖర్చు చాలా ఎక్కువ. దీని నీరు కూడా ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. కానీ నీటి ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటి బాటిల్ ధర దాదాపు రూ.45 లక్షలు. ఈ సీసాలో 1 లీటరు నీరు కూడా పట్టదు. ఇది 750 మి.లీ నీటిని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, అక్వా డి క్రిస్టెల్లో ట్రిబ్యూటో ఎ మోడిగ్లియాని వాటర్ బాటిల్ ధర రూ.45 లక్షల కంటే ఎక్కువ. ఈ వాటర్ బాటిల్ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు.
ఈ ఒక్క నీటి బాటిల్ లక్షల రూపాయలు ఎందుకు ఖర్చవుతుందో అనేక కారణాలు ఉన్నాయి. నీరు ఖరీదైనదిగా ఉండటానికి కారణం కూడా దాని బాటిల్. ఈ వాటర్ బాటిల్ 24 క్యారెట్ల ఘన బంగారంతో తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టమిరానో రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాటిల్, కాగ్నాక్ డుడోగ్నాన్ హెరిటేజ్ హెన్రీ IV, ఫెర్నాండోచే రూపొందించింది. ఈ నీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇది కాకుండా, ఇది సాధారణ నీటి కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.