ప్రపంచంలోనే అందమైన మహిళలు.. కానీ ఆ సమయంలో ఊరికి బయట గుడిసె బతుకులు.. ఎక్కడంటే..?

by I. Sairam |

ప్రస్తుతం ప్రపంచంలో 250 కంటే ఎక్కువ దేశాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి దేశానికి, గ్రామానికి, రాష్ట్రానికి అనేక నమ్మకాలు ఉంటాయి.

ప్రపంచంలోనే అందమైన మహిళలు.. కానీ ఆ సమయంలో ఊరికి బయట గుడిసె బతుకులు.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో 250 కంటే ఎక్కువ దేశాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి దేశానికి, గ్రామానికి, రాష్ట్రానికి అనేక నమ్మకాలు ఉంటాయి. ఇక వాటిని గురించి విన్న తర్వాత షాక్‌కు గురికావడం మన వంతు అవుతుంది. సోషల్ మీడియా, అత్యాధునిక టెక్నాలజీ అంటూ ఎన్నో రకాల మార్పులు వస్తున్నా కొన్ని కొన్ని దేశాల్లో ఆ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. అలా భారత దేశానికి ఉన్న ఒక పొరుగు దేశంలో స్త్రీలు పాటిస్తున్న ఒక వింత ఆచారం చూస్తే నిజంగానే షాక్‌ అవుతారు. మరి ఆ ఆశ్చర్యకరమైన ఆచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

సాధారణంగా మన చిన్నతనంలో ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే ఆమెను ఇంట్లో ఏ వస్తువులు టచ్ చేయనీయకుండా ఇంట్లోనే ఓ మూలన కూర్చోపెట్టేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూస్తున్నారు. వింత వింత ఆచారాలతో ఇబ్బంది పెట్టడం మానేశారనే చెప్పాలి. కానీ నేను చెప్పబోతున్న దేశంలో మాత్రం ఇప్పటికీ అక్కడ మహిళలు ఋతుస్రావం(పీరియడ్స్) సమయంలో ఇంటికి దూరంగా ఊరి బయట నివసించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇక్కడి ఆడవాళ్ల అందం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. ఏంటి నిజమా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ దేశం మరెక్కడో కాదు..మన పొరుగుదేశం పాకిస్తాన్‌లోని ఓ లోయ.

సమాచారం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఉంటారని చెప్పబడే తెగకు నిలయం పాకిస్తాన్. పాకిస్తాన్‌లోని అత్యంత అందమైన అమ్మాయిల మర్మమైన ప్రపంచం ఇది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిత్రాల్ జిల్లా. ఇక్కడ కలాష్ లోయ ఒకటి ఉంటుంది. ఈ లోయలోని స్త్రీలు తమ కోరికలను తామే తీర్చుకుంటారని చెబుతారు. వారు తమ సొంత ప్రేమికుడిని ఎంచుకోవడమే కాకుండా, వివాహం తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడితే అతడితోనే వెళ్లిపోవచ్చు అనే ఆచారం కూడా ఉందట.

కలాష్ వ్యాలీలోని మహిళల తల్లిదండ్రులు కూడా వారి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. ఈ తెగ ప్రత్యేక సంస్కృతి వారిని పాకిస్తాన్ నుండి భిన్నంగా చేస్తుంది. అదే సమయంలో, ఋతుస్రావం, గర్భధారణ సమయంలో మహిళలు, బాలికలు గ్రామ బయట ‘బాలషేణి’ అనే ప్రత్యేక భవనంలో నివసించాలనే ఆచారం ఇక్కడ ఆనాదిగా కొనసాగుతూ వస్తోందట. ఈ స్త్రీలు వారి రుతుక్రమ సమయంలో గ్రామానికి రావడానికి అనుమతి లేదు. కానీ, వారు పొలాల్లో పని చేయవచ్చు. ఇక ఇలాంటివి విన్నప్పుడు ఈ జనరేషన్‌లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని సందేహం కలగక మానదు.

Next Story