- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI Failure : 95% జనరేటివ్ ఏఐ ప్రాజెక్టుల వైఫల్యం : తప్పు టెక్నాలజీదేనా?
చాలా సంస్థలు ఆకర్షణీయమైన చాట్‌బాట్‌ల వంటి టూల్స్ వెనుక పడుతూ, కొన్నిసార్లు నైపుణ్యాన్ని విస్మరిస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : ప్రపంచమంతా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఫోకస్ చేసింది. ఇప్పటికే అనేక సంస్థలు ఈ సాంకేతికతను యూజ్ చేస్తూ ప్రొడక్టివిటీలో దూసుకెళ్తున్నాయి. అనేక మంది వ్యక్తులు సైతం దీని ఆధారంగా అద్బుతాలు క్రియేట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్‌పట్ల కొత్త ఆశలు రేకెత్తిస్తున్న అత్యాధునిక సాంకేతికతత ఏదైనా ఉందంటే దటీజ్ ఏఐ(A.I). కానీ. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) నుంచి విడుదలైన ఒక కొత్త నివేదిక (The Gen AI Divide: State of AI in Business 2025) మాత్రం అందుకు భిన్నమైన అంశాన్ని ముందుకు తెచ్చింది.
తాజా నివేదిక ప్రకారం.. కొన్నిచోట్ల, ముఖ్యంగా అమెరికా సంస్థలలో జనరేటివ్ ఏఐ(Generative AI) ప్రాజెక్టులలో 95% విఫలం అవుతున్నాయి. దీంతో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టినప్పటికీ వాటి నుంచి ఊహించిన ఫలితం ఉండట్లేదని, వాల్యూ లభించడం లేదని అక్కడి సంస్థలు నిరాశ చెందుతున్నాయి. అయితే అదే సందర్భంలో ఈ పరిణామాలకు అసలు కారణం అమలు చేసే వ్యక్తులు, సంస్థల వైఫల్యం తప్ప, టెక్నాలజీ తప్పు ఏమీ లేదని కూడా నివేదిక పేర్కొన్నది. సంస్థలు సాంకేతికను ఎలా అమలు చేస్తున్నాయనేదానిలోనే లోపం ఉందని తెలిపింది.
ముఖ్యంగా చాలా సంస్థలు ఆకర్షణీయమైన చాట్‌బాట్‌ల వంటి టూల్స్ వెనుక పడుతూ, కొన్నిసార్లు నైపుణ్యాన్ని విస్మరిస్తున్నాయని నివేదికను విశ్లేషించిన సాంకేతిక పరిశోధకులు అంటున్నారు. దీంతో అవి వర్క్ ఫ్లోలలో సమ్రగంగా ఏకీకృతం కావడం(Integrating)లో వైఫల్యం కారణంగా కేవలం 5% జనరేటివ్ ఏఐ ఆధారిత ప్రాజెక్టులు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇవి సాధారణంగా బ్యాక్ ఆఫీస్ అప్లికేషన్లకు సంబంధించినవి. ఆసక్తికరంగా నైపుణ్యంగల విక్రేతలతో నిర్వహించబడే ఏఐ ఆధారిత ప్రాజెక్టులు మాత్రం 67% సక్సెస్ రేట్ సాధిస్తుండగా.. సంస్థల లోపల నిర్వహించబడే ప్రాజెక్టులు మాత్రం కేవలం 33% సక్సెస్ రేటును సాధిస్తున్నాయి. ఈ తేడా సంస్థలలో ఏఐ (AI) అమలు చేయడంలో స్కిల్స్ అండ్ స్ట్రాటజీ ప్రాముఖ్యతను, వాటి అవసరాన్ని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సో.. తప్పు ఏఐ టెక్నాలజీది ఏమాత్రం కాదు, దాని గురించి తగిన స్కిల్స్ లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు నిపుణులు.






