- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లిలో పవర్‌ఫుల్ వోర్డ్స్.. ఆ మాటలకు కన్నీళ్లే సమాధానం! (వీడియో)
వరుడితో పాటు వధువు, అతిధులకు కూడా కన్నీళ్లు వచ్చాయి. Man gave a heartfelt speech at the wedding.

దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచంలో ఆచరణకు అత్యంత కష్టమయ్యింది, అలాగే అత్యంత అవసరనమైనది ప్రేమ, దయ, కరుణ చూపడం. నిజానికి, వీటి ద్వారా మాత్రమే మనిషి, మహానుభావుడు కాగలడు. ఎలాంటివారినైనా, ఏ పరిస్థితులనైనా ఓడించి గెలవగలడు. అలాంటి ఓ వ్యక్తి గురించి హృదయాన్ని కదిలించే ఒక వెడ్డింగ్ స్పీచ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. స్కూల్లో చదువుకునే చిన్ననాటి రోజుల్లో తాను తరుచూ, ఏడిపిస్తూ, వెక్కిరిస్తూ, వేధించిన తన స్నేహితుడి పెళ్లిలో ఓ వ్యక్తి ఈ స్పీచ్ ఇస్తాడు. ఉటాకు చెందిన వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ అయిన బ్రాడ్‌క్యాప్‌ఫిల్మ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.
చిన్నతనంలో తనని వేధించిన తన స్నేహితుడు తన పెళ్లిలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేయడంతో అందరి కళ్లూ చమర్చుతాయి. వరుడు తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నాడు. "చివరకు నేను అతనిని అడిగాను.. డ్యూడ్, నేను మంచివాడిని కాదు. నాలాంటి వారితో ఎందుకు స్నేహం కొనసాగించావు? అని. ఆ రోజు అతను నాతో చెప్పినది నేను ఎప్పటికీ మరచిపోలేను. అది నా హృదయంలో నిలిచిపోయింది. 'నీ శత్రువులను నాశనం చేయడానికి వారితో స్నేహం చేయడమే ఉత్తమ మార్గం' అని అతను చెప్పాడు. శత్రువును కూడా ప్రేమించమనే పాఠం ఉన్న ఈ ప్రసంగం సమయంలో వరుడితో పాటు వధువు, అతిధులకు కూడా కన్నీళ్లు వచ్చాయి.






