- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: ఆ ప్రాంతంలో ఒకే మహిళతో అన్నదమ్ముల కాపురం.. ఇదెక్కడి వింత మావా!
Viral News: మనదేశంలో అన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral News: మనదేశంలో అన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని తెగగలవారి పద్దతులు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఎందుకంటే వారి ఆచారం నమ్మశక్యం లేని విధంగా ఉంటుంది. ఒక భర్తకు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే అది పెద్ద విషయం కాదు. కానీ ఒకే భార్యకు ఇద్దరు భర్తలు ఉంటే మాత్రం అది కచ్చితంగా వింతే అవుతుంది. సమాజం కూడా వింతగా చూస్తుంది. అయితే మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని తెగల ప్రజలు ఇప్పటికీ ఇలాంటి పద్దతులు పాటిస్తూనే ఉన్నారు. ఒక దేశంలో కొన్ని లైంగిక అలవాట్లు ఉంటాయి. దాని గురించి సమాజంలో మాట్లాడటం అంత ఈజీకాదు. అలాంటి వాటి గురించి చెప్పినా ఎవరూ నమ్మరు.
ప్రతిదేశం లైంగిక జీవితంలో అనేక వైవిద్యాలను కలిగి ఉంటుంది. కొన్ని దేశాల్లో తమకంటే పెద్ద వయస్సున్న మహిళతో సంబంధం తప్పుకాదు. మరికొన్ని చోట్ల తెలియని వ్యక్తులతో సంబంధాలను తప్పు పట్టరు. ఇదంతా అక్కడ స్వేచ్ఛగానే సాగుతుంది. అలాంటి విచిత్రమైన ఆచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి తెగ ఉంది. ఈ తెగలోని వ్యక్తిని వివాహం చేసుకునే మహిళ, తన భర్తతోపాటు అతని సోదరులకు కూడా భార్యగా మారి వారితో పిల్లలను కంటుంటారు. కొద్దిపాటి ఆస్తులు చీలిపోకుండా ఉమ్మడిగా ఉండేందుకు పేద కుటుంబాలు ఈ బహు భర్త్రుత్వం పద్ధతిని పాటిస్తున్నాయి.
ఇద్దరు సోదరులు ఒక మహిళను వివాహం చేసుకుని సంసార జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గడుపుతారు. అన్నదమ్ములు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని వేరే కాపురాలు పెడితే సమస్యలు వస్తాయని వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై విభేదాలు వస్తాయని వారి భయం అట. అందుకే అన్నదమ్ములంతా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇక పిల్లలను కనేందుకు వారు వంతులు వేసుకుని తన గడుపుతారని ముగ్గురు భర్తలు ఉన్న ఓ మహిళ చెబుతోంది.






